పోక్సో కేసుల సత్వర విచారణకు ఏపీలో 16 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసారు. ప్రత్యేక కోర్టుల పరిధిని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. చిత్తూరు, తూ.గో, నెల్లూరు, ప్రకాశం, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం,కర్నూలు, కడప, అనంత జిల్లాల్లో ప్రత్యేక కోర్టులను జిల్లా మొత్తం పరిధిలోకి తెస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం… విజయవాడ ప్రత్యేక కోర్టు పరిధిలోకి మెట్రోపాలిటన్ ఏరియాను నిర్ధారించించి. మిగిలిన కృష్ణా జిల్లా అంతా మచిలీపట్నం ప్రత్యేక కోర్టు పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు జారీ…
గత కొన్ని రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 6,328 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 35,315 గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 822.30 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 42.6064 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి తగ్గుతుంది. తాజాగా రాష్ట్రంలో 3,841 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,93,354 కి చేరింది. ఇందులో 18,42,432 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 38,178 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 38 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 12,744 కి చేరింది. ఇకపోతే గడిచిన…
రెండున్నరేళ్ల డెడ్‌లైన్ దగ్గర పడుతోంది. మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. ఎంత లేదన్నా పవర్ పవరే కదా? దాన్ని కాపాడుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరం లేకుండా తాను సశ్చీలుడునని చెప్పుకొంటున్నారు ఓ డిప్యూటీ సీఎం. అంతేకాదు చివరకు తనకంటే వయసులో చాలా చాలా చిన్నవాడైన సీఎం జగన్ కాళ్లమీద పడ్డారు. ఇవన్నీ ఆయన పవర్‌ని కాపాడతాయా? నిజాయితీగా పేదవారి కోసం పనిచేశానని చెబుతున్నారుఎవరు కనిపించినా ఒకటే పాట పాడుతున్న డిప్యూటీ సీఎం! మంత్రి పదవి రాగానే ఏసీ…
శ్రీశైలండ్యాం వద్దకు భారీగా చేరుకున్నారు తెలంగాణ పోలీసులు. శ్రీశైల డ్యాం ఎడమగట్టు గేటు వద్ద పహార కాస్తున్నారు తెలంగాణ పోలీసులు. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం వద్ద కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. శ్రీశైలం జలాశయంలోని నీటి వినియోగంపై వివాదం నేపథ్యంలో భద్రత కల్పిస్తున్నారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం లోకి వెళ్లే వాహనాలను, సిబ్బందిని క్షుణ్ణంగా పరిశీలించి పంపుతున్నారు పోలీసులు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 14,314 క్యూసెకులు ఉండగా…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి తగ్గుతుంది. తాజాగా రాష్ట్రంలో 3,797 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,89,513 కి చేరింది. ఇందులో 18,38,469 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 38,338 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 35 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 12,706 కి చేరింది. ఇకపోతే గడిచిన…
అధికార పార్టీ నుండి బయటకు వచ్చిన ఆ మాజీ ఎమ్మెల్యేకి ప్రతిపక్ష పార్టీ కూడా షాక్ ఇచ్చింది. ఇంటి కూటికి.. బంతి కూటికి కాకుండా పోయారు. అంతా మోసం చేశారని వాపోతున్నారట. రాజకీయ భవిష్యత్‌పై బెంగ పెట్టుకున్నారట. ఎవరా నాయకుడు? ఏమా కథ? పొలిటికల్ స్టెప్పులు సరిగ్గా వేయలేకపోయారా? ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు పొలిటికల్ ఫ్యూచర్ పై ప్రకాశం జిల్లాలో మళ్లీ చర్చ మొదలైంది. ఇటు అధికార వైసీపీలో అటు ప్రతిపక్ష టీడీపీలో డేవిడ్రాజుకి…
ఆయన ఎమ్మెల్సీ అయ్యి పదిరోజులు కూడా కాలేదు. అప్పుడే ఇబ్బందులు మొదలయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు అదేపనిగా ఫోన్ చేసి బెదిరిస్తున్నారట. ఆ కాల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఇంతకీ ఎమ్మెల్సీని బెదిరిస్తున్నది ఎవరు? ఏమని వార్నింగ్ ఇస్తున్నారు? ఎమ్మెల్సీకి ఎవరిపై అనుమానాలు ఉన్నాయి? లెట్స్ వాచ్! ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ అవుదామని రాజకీయాల్లోకి వచ్చారు! ఏపీలో ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన నలుగురిలో ఆర్. రమేష్ యాదవ్‌ను ఎంపిక చేయడం పార్టీ వర్గాలను…
ఆ జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలను కేబినెట్ బెర్త్ ఊరిస్తోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అప్పుడే ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారట. ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలంటే కీలకంగా మారే సమీకరణాలేంటి? ఇప్పటికే జిల్లా నుంచి మంత్రులుగా ఉన్నవారిని కదుపుతారా? ఇంతకీ ఏంటా జిల్లా? ఈసారి కేబినెట్లో చోటు కోసం నేతలు గట్టి ప్రయత్నాలు రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్లో మార్పులు చేర్పులు చేస్తామని మంత్రుల ప్రమాణ స్వీకారం సమయంలో చెప్పారు ఏపీ సీఎం జగన్.…
జులై 23, 2021 నుంచి ఆగష్టు 8 వరకు జపాన్ టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్‌కు ఏపీ నుంచి భారతదేశం తరపున పాల్గొంటున్న పి.వి సింధు, ఆర్. సాత్విక్ సాయిరాజ్, రజనీలకు విషెస్ చెప్పారు సీఎం వైఎస్ జగన్. ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చెక్ అందజేసిన సీఎం వైఎస్ జగన్… విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించిన జీవోను పి.వి. సింధుకి అందజేశారు. రజనీ (ఉమెన్స్ హకీ) చిత్తూరు జిల్లా,…