తెలుగు రాష్ట్రల్లో వర్షాలు ఇప్పుడు కాస్త తగ్గాయి. అలాగే ఎగువ నుండి కూడా వరద కూడా రాకపోవడంతో శ్రీశైలం జలాశయంకి వచ్చిన వరద నీరు పూర్తిగా నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో మరియు ఔట్ ఫ్లో మాత్రం 21,189 గా ఉంది. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 820 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 40.8748 టీఎంసీలు…
గూడూరు ప్రేమజంట కేసులో నిందితుడు వెంకటేష్ స్నేహితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారాడు వెంకటేష్ స్నేహితుడు శివ. ప్రస్తుతం అతను పరారీలో ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు… వెంకటేష్ స్నేహితుడు శివ దొరికితే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది అంటున్నారు. అయితే ఈరోజు శివను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టు కూడా కీలకంగా మారింది. అది ఈ…
తిరుమల శ్రీవారిని నిన్న 14433 మంది భక్తులు దర్శించుకున్నారు. 7570 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా హుండి ఆదాయం 1.34 కోట్లు వచ్చింది. అయితే తాజాగా వర్చువల్ ఆర్జిత సేవా టిక్కెట్లు కలిగిన భక్తులు దర్శనాని వాయిదా వేసుకునే వెసులుబాటు కల్పించిన టీటీడీ ఏఫ్రిల్ 21 నుంచి జూన్ 30వ తేది వరకు వర్చువల్ ఆర్జిత సేవా టిక్కెట్లు కలిగిన భక్తులు ఈ ఏడాది చివరి లోపు స్వామివారిని దర్శించుకునే వెసులుబాటు కల్పించింది. ఇక జిలేబి, మురుకు…
ఏపి,తెలంగాణల మధ్య తాజా జలవివాదంలో వివిధ రాజకీయ పార్టీల ఆరోపణలు విచిత్రంగా వుంటున్నాయి. ఒకవైపున తెలంగాణ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి,శ్రీనివాసగౌడ్ వంటివారు వైఎస్‌రాజశేఖరరెడ్డి తెలంగాణకు రావలసిన నీటిని దోచుకున్నారంటూ దొంగలు రాక్షసుల భాషలో ధ్వజమెత్తారు. దీనిపై జగన్ ప్రభుత్వం నుంచి తీవ్రస్పందన లేదు గనక ఇదంతా మ్యాచ్‌ఫిక్సింగ్ అనీ లాలూచీ అనీ టిడిపినాయకులు ఆరోపించారు.తర్వాత ఎపిప్రభుత్వ సలహాదారు సజ్జలరామకృష్ణారెడ్డి వంటివారు స్పందించాక క్యాబినెట్ కూడా నిర్ణయాలు చేసింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి జగన్ తెలంగాణలో మన…
ఐదు దశాబ్దాలుగా నలుగుతోన్న బ్యారేజ్ అంశంపై ఎట్టకేలకు ట్రైబ్యునల్ నుంచి సానుకూల తీర్పు వచ్చింది. ఆ తీర్పుతో ఖుషీ అయ్యారు అధికార పార్టీ నాయకులు. ఆ విజయం తమదే అని ప్రచారం చేసుకున్నారు కూడా. త్వరలో కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభిస్తామని ప్రకటనలు గుప్పించారు. కానీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనించి ఎక్కడి వారు అక్కడే గప్‌చుప్. ఇంతకీ నేతలకు మింగుడు పడని అంశాలేంటి? దశాబ్దాల కల.. కలేనా? 1961లోనే నేరడి బ్యారేజీ కోసం శంకుస్థాపన నేరడి బ్యారేజ్.…
రాజమండ్రి : జల వివాదంపై ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జల వివాదం ఏపీ ప్రజల సమస్య అని… ప్రజల పక్షాన రాష్ట్ర బిజెపి పోరాడుతుందన్నారు. ఏపి జలాల విషయంలో అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈనెల 4వ తేదీన బిజెపి ముఖ్య నాయకులతో కర్నూల్ లో సమావేశం నిర్వహించి.. ఈ వివాదంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. read also : దర్భంగా పేలుడు కేసులో కీలక…
పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో హైపవర్ కమిటీ ఏర్పాటు చేశామని…మూడు, నాలుగు రోజుల్లో కమిటీ నివేదిక ప్రభుత్వానికి వస్తుందన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. కమిటీ సూచనలు మేరకు విద్యార్థులకు మార్కులు ప్రకటిస్తామని.. విద్యార్థుల భవిష్యత్ కి ఇబ్బందులు లేకుండా ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. ఈనెలాఖరు లోపు విద్యార్థులకు ఫలితాలు ప్రకటిస్తామని… ఆగస్టులో సెట్ ఎగ్జామ్స్ యథాతదంగా జరుగుతాయని… ఆగస్టు రెండో వారం కల్లా విద్యా సంవత్సరం ప్రారంభిస్తామని వెల్లడించారు…
సింహాచలం భూముల అక్రమాల్లో టార్గెట్ ఫిక్స్ అయిందా? అశోక్ గజపతిరాజు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా? త్వరలో కీలక పరిణామాలు ఉంటాయా? సూత్రధారులు.. పాత్రధారుల చిట్టా బయటపడుతోందా? అసలేం జరుగుతోంది? 700 ఎకరాలను ఆలయ రికార్డుల నుంచి తప్పించారా? ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న సింహాచలం దేవస్థానం భూముల విషయంలో ఏం జరగబోతుందా అనే ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం విచారణ చేపట్టింది. భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని తమ దృష్టికి వచ్చిన వెంటనే రంగంలోకి దిగింది సర్కార్.…
విశాఖలో సీమ పందుల కోసం సినీ ఫక్కీలో దాడి చేసారు దుండగులు. అర్ధరాత్రి వేంపాడు టోల్ ప్లాజా దగ్గర 100మంది హాల్ చల్ చేసారు. విజయనగరం నుంచి చెన్నైకి విత్తన పందులను తరలిస్తున్న వ్యాన్ అడ్డగించి డ్రైవర్, సహాయకులపై దాడి చేసి సీమపందుల వ్యాన్ అపహరించేందుకు విఫలయత్నం చేసారు. అయితే వెంటనే అక్కడ ఉన్న పోలీసులు అలెర్ట్ కావడంతో దుండగులు పరారయ్యారు. ఆ సీమ పందులు ఉన్న వాహనంను వెంబడించి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దాంతో ఈ…
తూర్పుగోదావరి జిల్లాలోని ఆలయాల్లోకి దర్శనాలకు నేటి నుంచి భక్తులకు అనుమతి ఇస్తున్నారు. దాదాపు రెండు నెలల తర్వాత ఇవాళ ఉదయం నుంచి భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. అన్నవరంలో నేటి నుంచి భక్తులకు సత్యదేవుని వ్రతములు, కల్యాణములు, తలనీలాల సమర్పణకు అవకాశం కల్పించారు. అయినవల్లి , అంతర్వేది, అప్పనపల్లి, కోనసీమ తిరుమల వాడపల్లి ఆలయాలకు భక్తుల రాక తిరిగి ప్రారంభమైంది. అయితే మధ్యాహ్నం ఒంటి గంట వరకూ మాత్రమే భక్తులకు అనుమతి ఇస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు.