సెక్రటేరియట్‌లో కొనసాగుతున్న ఉద్యోగ సంఘాల నేతల బైఠాయింపు
సీఎస్ నుంచి సమాచారం కోసం ఎదురు చూస్తోన్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటు ఉద్యోగ సంఘాల నేతలు ఏపీ సెక్రటేరియట్‌లో బైఠాయించారు.ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల జేఏసీ నేత బండి శ్రీనివాస్‌రావు సీఎం జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కుడి చేత్తో, ఎడం చేత్తో ఓట్లేసి జగన్ ను గెలిపించా మన్నారు. జగన్‌ను గెలిపించేందుకు మేం ఎంతో ప్రయత్నిం చామ న్నారు. లక్షల మంది ప్రతినిధులమైన మమ్మల్ని ఎందుకు పట్టించు కోవడం లేదని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. పీఆర్సీ నివేదిక కోసం ఇప్పటికే ఉద్యోగ సంఘాలుగా చాలా ఓపిక పట్టి ఎదురు చూశామని, అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు.
మా డిమాండ్ల కోసం అవసరమైతే విధుల బహిష్కరణ చేస్తామని గతంలో చెప్పాం. రెండు రోజుల్లో రిపోర్టు ఇస్తామని గతంలో సీఎస్ హామీ ఇచ్చారు. ఉద్యోగులకు ఆర్థికపరమైన బిల్లులు ఏవీ రావడం లేదు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఏ ఆస్పత్రిలో చెల్లడం లేదని ఆయన చెప్పారు. రీఎంబర్స్ మెంట్ పేమెంట్లు కూడా ఇవ్వడం లేదు. మేము ప్రభుత్వానికి సానుకాలంగా ఉన్నాం. అధికారులు మాపై అలసత్వం ప్రదర్శిస్తున్నారు. పీఆర్సీపై ఏం చేస్తున్నారో మాకు వెం టనే తెలియజేయాలి. ప్రభుత్వం మంచి మనసుతో మా బాధలు అర్థం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నివేదిక ఇస్తే తదుపరి ఏం చేయాలో ఆలోచిస్తామని శ్రీనివాసరావు తెలిపారు.
భవిష్యత్ కార్యాచరణను రేపు ప్రకటిస్తాం: బొప్పరాజు, ఏపీజేఎసీ అమరావతి ఛైర్మన్
ప్రభుత్వం రెండేళ్లుగా పీఆర్సీ నివేదిక ఇవ్వకపోవడం బాధాకరమని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పీఆర్సీ నివేదిక ఇస్తారనే ఆశిస్తున్నామన్నారు. ఇవాళ నివేదిక ఇస్తే తీసుకుని వెళ్తాం. నివేదికను ఎందుకు రహస్యంగా దాస్తున్నారో అర్థం కావడం లేదని బొప్పరాజు అన్నారు. నివేదిక విడుదలను తరచూ వాయిదా వేస్తూ, తేదీలు తరచూ మార్చుతున్నా సహనంతో ఎదురు చూస్తున్నాం. పీఆర్సీ నివేదిక తీసుకున్నాకే ఇక్కడి నుంచి బయటకు వెళ్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.