Srinivasa Mangapuram OTT: మహేష్ మేనల్లుడు డిజిటల్ ఎంట్రీ.. రిలీజ్ రోజే ఓటీటీ డీల్ ఫిక్స్ చేసుకున్న ‘శ్రీనివాస మంగపురం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srinivasa Mangapuram OTT: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమైన మూవీ ‘శ్రీనివాస మంగపురం’. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో కూడా ఈ మూవీ విడుదలైంది. అయితే రిలీజ్ రోజే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్డేట్ కూడా ఆఫీషియల్ గా రావడం విశేషం. ఈ మూవీలో జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇస్తుండగా, బాలీవుడ్ స్టార్ రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని తెలుగు ప్రేక్షకులకు కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఈ ఇద్దరూ సినీ నేపథ్యంలో వచ్చిన వల్లే కావడంతో ఈ సినిమాకు ప్రత్యేక బజ్ ఏర్పడింది.
ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైన సందర్భంగా చిత్ర బృందం డిజిటల్ స్ట్రీమింగ్ ఎక్కడ జరుగుతుందో రివీల్ చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుందని ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ‘శ్రీనివాస మంగపురం’ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు రానుంది. అయితే విడుదల తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు. బాక్సాఫీస్ ప్రదర్శనను బట్టి ఓటీటీ రిలీజ్ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. సినిమాలో సీనియర్ నటుడు మోహన్ బాబు కీలక ప్రతినాయక పాత్రలో కనిపించగా, షామ్, బ్రహ్మాజీ, నరేష్ విజయకృష్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ‘శ్రీనివాస మంగపురం’ను చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మించారు. సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ అందించారు.
Also Read
- Jacqueline Fernandez: 62 ఏళ్ల కల్ట్ హారర్ థ్రిల్లర్ కు రీమేక్?.. జాక్వెలిన్‌కు మరో భారీ అవకాశం!
- Maharani Season 5: ఐదేళ్లుగా ఓటీటీని ఏలుతున్న పొలిటికల్ థ్రిల్లర్.. ఇప్పుడు ఐదో సీజన్‌కు కౌంట్‌డౌన్!
- OTT Releases: థ్రిల్లర్ నుంచి రొమాన్స్ వరకు...ఈ వారం ఓటీటీలో ఎంటర్టైన్మెంట్ జాతర..
- Suriya47: దీపావళి బరిలో 'సూర్య47'?.. హ్యాట్రిక్ రిలీజ్‌కు స్టార్ హీరో రెడీ!
ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార కంటెంట్ సినిమాపై మంచి అంచనాలను తీసుకొచ్చాయి. ముఖ్యంగా జయకృష్ణ తొలి చిత్రం కావడం, రాషా థడాని టాలీవుడ్ ఎంట్రీ కావడం వల్ల ఈ సినిమాపై యువ ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పుడు అందరి దృష్టి బాక్సాఫీస్ ఫలితాలపైనే ఉంది. తొలి రోజే ఓటీటీ భాగస్వామి ఖరారవడంతో సినిమా డిజిటల్ రన్ కూడా బలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. థియేటర్లలో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో, ఆ తర్వాత ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Srinivasa Mangapuram OTT: మహేష్ మేనల్లుడు డిజిటల్ ఎంట్రీ.. రిలీజ్ రోజే ఓటీటీ డీల్ ఫిక్స్ చేసుకున్న ‘శ్రీనివాస మంగపురం’
-
West Bengal Cash Haul: ఎక్స్- బస్ డ్రైవర్ ఇంట్లో రూ. 28 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం..
-
Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. జలకళ సంతరించుకున్న ప్రాజెక్టులు..
-
Supreme Court: జంతర్ మంతర్ ‘‘పెల్లెట్ గన్’’ వివాదం.. ఢిల్లీ పోలీసులకు సుప్రీం కీలక ఆదేశాలు..
-
Jacqueline Fernandez: 62 ఏళ్ల కల్ట్ హారర్ థ్రిల్లర్ కు రీమేక్?.. జాక్వెలిన్‌కు మరో భారీ అవకాశం!
ట్రెండింగ్
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?