Jacqueline Fernandez: 62 ఏళ్ల కల్ట్ హారర్ థ్రిల్లర్ కు రీమేక్?.. జాక్వెలిన్‌కు మరో భారీ అవకాశం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jacqueline Fernandez: బాలీవుడ్లో రీమేక్‌ల ట్రెండ్ కొత్తేమీ కాదు. కల్ట్ క్లాసిక్‌లను మళ్లీ కొత్త తరానికి పరిచయం చేయాలనే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఓ వార్తే బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 62 ఏళ్ల క్రితం వచ్చిన కల్ట్ హారర్ థ్రిల్లర్ రీమేక్ లో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఆమె అగ్రిమెంట్లమీద సైన్ కూడా చేసినట్లు సమాచారం. అయితే ఇదే నిజమైతే ఇటీవల ‘వెల్కమ్ టు ది జంగిల్’ విజయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన జాక్వెలిన్‌కు ఇది మరో కీలక ప్రాజెక్ట్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. ఆమె 1964లో విడుదలైన క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్ ‘వో కౌన్ థీ’ రీమేక్ లో జాక్వెలిన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో రాజ్ ఖోస్లా దర్శకత్వంలో తెరకెక్కిన ఆ మూవీలో మనోజ్ కుమార్, ప్రేమ్ చోప్రా, హెలెన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సస్పెన్స్, హారర్, మిస్టరీ అంశాలతో రూపొందిన ఆ సినిమా అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని, బాలీవుడ్ చరిత్రలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది.
అయితే కొత్త మూవీ ఆ సినిమాకు నేరుగా రీమేక్ కాదని, దాని మెయిన్ కాన్సెప్ట్ తో ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కథ నార్త్ ఇండియాలోని ఒక చిన్న పట్టణం నేపథ్యంలో సాగనుంది. ఇందులో జాక్వెలిన్ తన చుట్టూ జరుగుతున్న విచిత్రమైన సంఘటనల మధ్య చిక్కుకుపోయే పాత్రలో నటించనున్నట్లు సమాచారం. హారర్‌తో పాటు మిస్టరీ, యాక్షన్ అంశాలు కూడా ఈ మూవీలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని ఖ్యాతి మదన్ నిర్మిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయని, అయితే టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదని తెలుస్తోంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు మేకర్స్ కథకు సంబంధించిన పూర్తి వివరాలను గోప్యంగానే ఉంచుతున్నారు.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, ఈ చిత్రంలో జాక్వెలిన్‌తో పాటు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. పృథ్వీరాజ్ ఇప్పటికే ‘బడే మియా చోటే మియా’ వంటి హిందీ చిత్రాల్లో నటించగా, ఓటీటీ ప్రాజెక్ట్ ‘సర్జమీన్’ ద్వారా కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇటీవల వరుసగా కామెడీ చిత్రాల్లో కనిపించిన జాక్వెలిన్ ఇప్పుడు పూర్తిగా భిన్నమైన హారర్ థ్రిల్లర్ జానర్‌ను ఎంచుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటిస్తే, క్లాసిక్ కథకు లేటెస్ట్ రూపం ఇవ్వడంలో మేకర్స్ ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి. ప్రస్తుతం మాత్రం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆఫీషియల్ అనాన్స్మెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!