ప్రజల జేబుల నుంచి ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా.. అందరికీ ఆరోగ్యం అందించే సమగ్ర ఆచరణ సాధ్య నమూనా విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ్. దీని అమలు కోసం తెలంగాణ, ఏపీ సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తా అన్నారు జేపీ. ఇది ఆచరణసాధ్య నమూనా అన్నారు. ఉచిత డయగ్నస్టిక్, ఉచిత పరీక్ష, ఆరోగ్యశ్రీ లో నుంచి తృతీయ స్థాయి వైద్యాన్ని తొలగించాలి.
తృతీయ వైద్యానికి భారీగా ఖర్చవుతుంది. అమెరికా ఆరోగ్య రంగంలో 35వ స్థానంలో ఉంది. సంపాదించే ఐదు డాలర్లలో ఒకటి వైద్యానికే ఖర్చు చేస్తున్నారు. తెలుగురాష్ట్రాల్లో ఏడాదికి 50లక్షల మంది అనారోగ్య కారణంగా పేదలవుతున్నారు. ప్రభుత్వాలు ఆరోగ్యానికి తక్కువ ఖర్చు పెడుతున్నాయి.ఈ ఒక్క పని జరిగితే అతిపెద్ద మార్పు వస్తుంది. వీటి అమలు ఎఫ్.డీ.ఆర్ తరపున త్వరలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తానన్నారు.