Khalifa: ‘ఖలీఫా’ నుంచి బిగ్ అప్డేట్.. మోహన్‌లాల్ డబ్బింగ్ పూర్తి.. పార్ట్ 2పై హైప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalifa: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఖలీఫా: పార్ట్ 1’ మరో కీలక అప్డేట్తో వచ్చింది. ఈ మూవీలో ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించనున్న సూపర్ స్టార్ మోహన్‌లాల్ తన డబ్బింగ్‌ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం ఆఫీషియల్ గా ప్రకటించడంతో అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. పృథ్వీరాజ్ అధికారిక నెట్వర్క్ పోఫాక్టియో సోషల్ మీడియాలో డబ్బింగ్ స్టూడియోలోని మోహన్‌లాల్ ఫొటోలను పంచుకుంది. ఆ పోస్టులో మాంబరక్కల్ అహమ్మదాలీ పాత్రకు మోహన్‌లాల్ డబ్బింగ్ పూర్తి చేసినట్లు వెల్లడించింది. పార్ట్ 1లో ఆయన పాత్ర పరిమితంగానే కనిపించినా, పార్ట్ 2లో మరింత కీలకంగా ఉండబోతుందని చిత్ర బృందం సంకేతాలు ఇచ్చింది. దీంతో సీక్వెల్‌పై కూడా ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.
వైశాఖ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఖలీఫా: పార్ట్ 1’ కథ బంగారం స్మగ్లింగ్ కేంద్రంగా సాగుతుంది. గల్ఫ్, లండన్, నేపాల్, కేరళ ప్రాంతాలకు విస్తరించిన వ్యాపార నెట్‌వర్క్‌ను నడిపే ఆమిర్ అలీ (పృథ్వీరాజ్) అనే వ్యక్తి చుట్టూ కథ తిరుగుతుంది. తన తాత మాంబరక్కల్ అహమ్మదాలీ నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని వారసత్వంగా అందుకున్న ఆమిర్, దానిని నిలబెట్టుకుంటాడా లేదా అన్నదే కథలో ప్రధాన అంశం. ఈ సినిమాలో పృథ్వీరాజ్‌తో పాటు నీల్ నితిన్ ముఖేష్, మాల్వికా శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో మోహన్‌లాల్ ఆమిర్ తాత పాత్రలో కనిపించనున్నారు. స్క్రీన్‌ప్లేను జిను వి. అబ్రహం అందించగా, ఆయన సహ నిర్మాతగానూ వ్యవహరించారు. సంగీతాన్ని జేక్స్ బెజోయ్ అందించగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను జోమోన్ టి. జాన్ నిర్వహించారు. ‘ఖలీఫా: పార్ట్ 1’ 2026 ఆగస్టు 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు ముందే వచ్చిన ఈ డబ్బింగ్ అప్డేట్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది.
Also Read
- Love Story: అనిరుధ్ మామ కళానిధి మారన్ ప్రేమ కథ తెలుసా?
- Mouli: టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు దొంగ నా కొడుకు .. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ బ్యానర్లో మూడో సినిమా?
- Veeradhi Veerulu: మాస్ మహారాజా - శ్రీవిష్ణు కాంబో మిస్ అయినట్లేనా? ‘వీరాధి వీరులు’పై పిన్ డ్రాప్ సైలెన్స్!
- Keerthy Suresh: స్పెషల్ సాంగ్ నుంచి స్టార్ హీరోల దాకా.. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ రేంజ్ మామూలుగా లేదుగా!
ఇక మోహన్‌లాల్ కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన తరుణ్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అతిమనోహరం’ చిత్రంలో పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. ఈ మూవీ 2026 డిసెంబర్ 24న విడుదల కానుంది. అలాగే ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందనున్న 100వ చిత్రం, ‘ఎల్367’, దిలీష్ పోతన్ తెరకెక్కిస్తున్న ‘నెడుకండం మిరాకిల్’ చిత్రాలు కూడా ఆయన చేతిలో ఉన్నాయి. అంతేకాకుండా రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’లో అతిథి పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతుండగా, తన కుమార్తె విస్మయ మోహన్‌లాల్ తొలి సినిమా ‘తుడక్కం’లో కూడా ఆయన ప్రత్యేక పాత్ర పోషించనున్నారు.
తాజావార్తలు
-
Imran Khan: ‘‘ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చు’’.. నిస్సహాయ స్థితిలో ఇమ్రాన్ ఖాన్ లేఖ!
-
Love Story: అనిరుధ్ మామ కళానిధి మారన్ ప్రేమ కథ తెలుసా?
-
INDIA Bloc: ఎన్నికల సంఘానికి 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టులో INDIA కూటమి పిటిషన్!
-
Mouli: టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు దొంగ నా కొడుకు .. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ బ్యానర్లో మూడో సినిమా?
-
AP Elections: ముగిసిన 23 పట్టణ స్థానిక సంస్థల నామినేషన్ల పర్వం.. రేపు పరిశీలన..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!