ఆపదలో దేవుడిలా మారిన Apple Watch.. కూతురు ఇచ్చిన గిఫ్ట్.. తండ్రికి ప్రాణం పోసింది!
- అది కేవలం గిఫ్ట్ కాదు..
- చావు అంచుల్లో ఉన్న తండ్రిని కాపాడిన ఆపిల్ వాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple Watch: టెక్నాలజీ ప్రాణాలను కాపాడగలదని నిరూపించిన ఘటన ఒకటి అమెరికాలో చోటుచేసుకుంది. కూతురు బహుమతిగా ఇచ్చిన Apple Watch మరణం అంచున ఉన్న ఓ తండ్రి ప్రాణాలను కాపాడింది. వాచ్‌లోని ఫాల్ డిటెక్షన్ (Fall Detection) ఫీచర్ సమయానికి స్పందించి ఎమర్జెన్సీ సర్వీసులకు సమాచారం అందించడంతో అతడికి వెంటనే వైద్యం అందింది. అమెరికాలోని ఒహాయో రాష్ట్రం, సిన్సినాటికి చెందిన మొహమ్మద్ ఇస్లాం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట చెత్త వేయడానికి వెళ్లిన ఆయన ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకున్నారు. కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చినప్పటికీ లేవడానికి కూడా శక్తి లేక నేలపైనే పడిపోయారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ” ఆ సమయంలో లేవాలని ప్రయత్నించాను.. కానీ కాలేదు. కొద్దిసేపటికే బయట అంబులెన్స్ సైరన్ వినిపించింది” అని ఆయన స్థానిక మీడియాకు తెలిపారు. వాస్తవానికి, ఇస్లాం స్పృహ కోల్పోయిన వెంటనే ఆయన పెట్టుకున్న Apple Watch ఫాల్ డిటెక్షన్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసింది. ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వాచ్ ఆటోమెటిక్‌గా ఎమర్జెన్సీ సేవలకు కాల్ చేయడంతో పాటు, ఎమర్జెన్సీ కాంటాక్టులకు కూడా సమాచారం పంపింది. దీంతో పారామెడిక్స్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఆయనను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆయనకు ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టినట్లు (Blood Clots in the Lungs) గుర్తించారు. సరైన సమయంలో ఆస్పత్రికి చేరుకోవడంతోనే ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటనకు ముందు నుంచే తనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు సమస్యలు, నడవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపించాయని, అయితే అసలు కారణం మాత్రం తెలియలేదని ఇస్లాం చెప్పినట్లు వెల్లడించింది. ఇక తన కూతురు ప్రేమతో గిఫ్ట్‌గా ఇచ్చిన Apple Watch తన ప్రాణాలను కాపాడిందని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆయన కుమార్తె కూడా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. తాను ఇచ్చిన గిఫ్ట్ తండ్రి ప్రాణాలను కాపాడిందని తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఘటనతో స్మార్ట్‌వాచ్‌లలో ఉండే భద్రతా ఫీచర్లు అత్యవసర పరిస్థితుల్లో ఎంత కీలక పాత్ర పోషించగలవో మరోసారి స్పష్టమైంది.
Also Read
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- 165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- 2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!