Sai Krishna లాకప్ డెత్ కేసులో కొత్త ట్విస్ట్.. హైకోర్టులో ఊహించని పరిణామం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Krishna Lockup Death Case: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు విచారణలో గురువారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేసును సీబీఐకి అప్పగించాలని దాఖలైన పిటిషన్ ఉపసంహరణ అంశంపై సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది.
విచారణ సందర్భంగా.. తనకు తెలియకుండా సీబీఐ విచారణ కోసం దాఖలైన పిటిషన్‌ను న్యాయవాది రిత్విక ఉపసంహరించుకున్నారని విజయలక్ష్మి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం ఆమెను “మీ తరఫున ఏ న్యాయవాది వాదించాలి?” అని ప్రశ్నించింది. అయితే, ఆశ్చర్యకరంగా నిన్న ఆరోపణలు చేసిన అదే న్యాయవాది రిత్వికనే తన తరఫున న్యాయవాదిగా కొనసాగించాలని విజయలక్ష్మి కోర్టును కోరారు. దీంతో ఈ వ్యవహారంలో కొత్త మలుపు చోటుచేసుకుంది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఇక హెబియస్ కార్పస్ పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారా అని హైకోర్టు ప్రశ్నించగా.. ప్రభుత్వం తరఫు న్యాయవాది విచారణకు రెండు వారాల సమయం ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే, అంత సమయం ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసిన హైకోర్టు, కేసు తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..