టమోటా ధరలు మొన్నటివరకు భగ్గుమాన్నాయి.. ఏకంగా డబుల్ సెంచరీ చేశాయి.. జనాలు టమోటా మాట కూడా తియ్యలేదు.. ఇప్పుడు ధరలు పూర్తిగా పడిపోయాయి.. ఏపీ మదనపల్లి మార్కెట్ లో ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. మొన్నటివరకు ఏకంగా రెండు వందలుపైన పలికిన టమాటాలు ఇప్పుడు రికార్డుస్థాయిలో తగ్గాయి. మదనపల్లె మార్కెట్లో ఊహించని విధంగా టమాటా ధరలు పతనమయ్యాయి… గత మూడు రోజులుగా మార్కెట్లు టమాటా దిగుబడి పెరగుతుండటం తో ధరలు దిగివస్తున్నాయి. బుధవారం కిలో 100 వరకు…
మదనపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డులో టమాట ధరలు భారీగా తగ్గాయి. గ్రేడ్ ‘ఏ’ టమాటాలు కిలో రూ. 50 నుంచి రూ. 64 వరకు పలికింది. గ్రేడ్ ‘బి’ రూ. 36 నుంచి రూ. 48 వరకు పలికింది.
చిరంజీవి ప్రభుత్వం మీద చేసిన కామెంట్స్ కి, టికెట్ రేట్స్ పెంపుకు లింకు పెట్టడం దురదృష్టకరమని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు. బడ్జెట్ పై రుజువులు తెలుసుకున్న తర్వాత ధరలు పెంచడం ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.
రాష్ట్రాన్ని రక్షించండి - దేశాన్ని కాపాడండి పేరుతో.. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 8 వరకు 26 జిల్లాల్లో సీపీఐ ఐస్సుయాత్ర చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.
Weather Update: ఈరోజు పశ్చిమం నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు తక్కువ స్థాయి గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే వారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తాజాగా మరో యువతి.. తాను ప్రేమించిన యువకుడి కోసం దేశం దాటి వచ్చింది. శ్రీలంకకు చెందిన ఓ యువతి.. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని యువకుడు.. సోషల్ మీడియాలో పరిచయం అయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారడంతో.. యువతి చిత్తూరు చేరుకుంది. అంతేకాకుండా వారిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ పేదల పక్కన ఉంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం పెత్తందార్ల వైపు ఉన్నారు అని ఆయన విమర్శించారు. ఈ విషయాన్ని తట్టుకోలేక చంద్రబాబు తమ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ చీప్ చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సింహాన్ని ఎదుర్కొనేందుకు గుంట నక్కలు, ఊర కుక్కలు ఒకటయ్యాయని ఆయన కామెంట్స్ చేశారు.
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వర్షాలకు హైదరాబాద్ పట్నమే మునిగిపోయింది... చంద్రబాబు కట్టించిన హైటెక్ సిటీయే మునిగిపోయింది.. ఉత్తర భారత దేశంతో పాటు దేశ రాజధాని ఢిల్లీ నగరమే నీట మునిగిపోయింది.. ప్రత్యేక సందర్భంలో వచ్చే వర్షాలకు మునిపోవడం సహజం.. ఇక చంద్రబాబు కూడా వచ్చే ఎన్నికల్లో మునిగిపోక తప్పదని బొత్స అన్నారు.