Ex MLA Kakara Nooka Raju Died: ఎస్.రాయవరం మండలం చినగుమ్ములూరుకి చెందిన మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. అనారోగ్యంతో విశాఖలోని ఒమిని ఆర్కే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నూకరాజు మృతితో కాకర కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.
పాయకరావుపేట నియోజకవర్గంకు మూడుసార్లు కాకర నూకరాజు ఎమ్మెల్యేగా తమ సేవలు అందించారు. జనాల్లో ఆయనకు మంచి పేరు ఉంది. కాకర నూకరాజు చివరి చూపు కోసం అభిమానులు ఆయన ఇంటికి చేరుకున్నారు. రాజకీయ నాయకులు ఆయన మృతిపై సంతాపం ప్రకటిస్తున్నారు.