ల్యాండ్ అయిన జగన్.. వైసీపీ నేతలు ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. జగన్ దంపతులు నేడు ( మంగళవారం ) గన్నవరం చేరుకున్నారు. పది రోజులు లండన్ టూర్ ముగించుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సీఎం జగన్ కు మంత్రులు జోగి రమేష్, విశ్వరూప్, డీజీపీ, సీఎస్, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. విజయవాడ చేరుకున్న సీఎం జగన్ గన్నవరం నుంచి రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లారు. అయితే, సీఎం జగన్ ఇవాళ రాష్ట్రంలో శాంతిభద్రతలు, తాజా పరిణామాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. విదేశీ పర్యటన ముగిసిన వెంటనే సీఎం వైఎస్ జగన్ రేపు ఢిల్లీ పర్యటకు వెళ్లనున్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెడతారని ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో హై-టెన్షన్ నెలకొంది.. దీంతో రాష్ట్రంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో రేపు సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
చంద్రబాబు హౌస్ రిమాండ్ పై తీవ్ర ఉత్కంఠ
తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ మూడో రోజుకు చేరుకుంది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. దీంతో నేడు తెలుగు దేశం పార్టీ నేతలు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. చంద్రబాబు అరెస్టుపై భవిష్యత్ కార్యాచరణలపై ఈ సమావేశంలో టీడీపీ నాయకులు చర్చించనున్నారు. ప్రస్తుతం చంద్రబాబు హౌస్ రిమాండ్ పై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది.
చంద్రబాబు అరెస్ట్.. ములాఖత్ కు కుటుంబ సభ్యులు
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినా.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. దీంతో ఆయనను కలిసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. అయితే, నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును అనుమతులు లభిస్తే ములాఖత్ లో భువనేశ్వరి, లోకేష్, బ్రహ్మిణి కలవనున్నారు. ఇప్పటికే ములాఖత్ కొరకు జైలు అధికారులకి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. మధ్యాహ్నం తర్వాత కలిసే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు తెలిపాయి.
బీఆర్ఎస్ నాయకులు ఖమ్మంలో 10కి 10 గెలుస్తారట..! నాకు నవ్వొస్తుంది
బీఆర్ఎస్ నాయకులు ఖమ్మం జిల్లాలో 10కి 10 గెలుస్తాం అంటున్నారు…నాకు నవ్వొస్తుంది.. అంటూ సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక స్వాగతమన్నారు. ప్రతి ఒక్కరికీ పేరు పేరున కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా స్వాగతం చెపుతున్నానని తెలిపారు. జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అన్ని మీకు విదితమే ఇది ఒక్క జిల్లాకే కాదు రాష్ట్రం మొత్తం ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు రాజకీయ పునరేకీకరణ జరుగుతుందన్నారు. పదేళ్లు తెరాస పాలనతో విసిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అన్ని అధికారంలోకి రాగానే కచ్చితంగా అమలు చేస్తాం అని రేపు cwc లో ప్రకటన చేస్తున్నామన్నారు. తెరాస నాయకులు ఖమ్మం జిల్లాలో 10కి 10 గెలుస్తాం అంటున్నారు…నాకు నవ్వొస్తుందంటూ భట్టి అన్నారు. 2014 లో గెలిచిన జలగం వెంకట్రావు, 2018 లో పువ్వాడ అజయ్ కూడా కాంగ్రెస్ వాసన తోనే గెలిచారని తెలిపారు. పొంగులేటి ఎంపీ గా గెలిచింది కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు వలనే గెలిచారని అన్నారు. పొంగులేటి వలన తెరాస లాభపడింది కానీ పొంగులేటికి వారి వలన లాభం జరగలేదన్నారు.
కేయూ పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు.. నేడు వరంగల్ బంద్
నేడు వరంగల్ బంద్ కు Kuc విద్యార్థులు పిలుపునిచ్చారు. Kuc పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని, వాటిని పరిష్కరించాలని విద్యార్థులు చేసిన డిమాండ్లను పట్టించుకోకపోవడం లేదని కేయూసి విద్యార్థి జెఎసి బంద్ కు పిలుపు నిచ్చారు. విద్యార్థి జేఏసీ బందుకు కాంగ్రెస్, బీజేపీ మద్దతు తెలిపింది. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఇచ్చిన బందు పిలుపు నేపథ్యంలో వరంగల్ లోని స్కూల్స్ కాలేజీలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించింది. దీంతో వరంగల్ లో ఉద్రికత్త నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘనలు జరకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 10 మంది సీనియర్లు సస్పెండ్
తెలంగాణలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది. ఈ ర్యాగింగ్ భూతం వల్ల ఎంతో మంది విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు. నిజానికి అన్ని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలు వేస్తున్నారు. ఈ భూతాన్ని తరిమికొట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి అక్రమార్కులు చట్ట ప్రకారం నేరమని, చట్టప్రకారం శిక్షార్హమని తెలిసినా కొందరు ఆకతాయి విద్యార్థులు మాత్రం పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. పరిచయం లేక ఇంటరాక్షన్ పేరుతో హద్దుమీరి వ్యవహరిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీలో వెలుగు చూసింది.
మణిపూర్‌లోని ఉఖ్రుల్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.1
మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో సోమవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. జాతీయ భూకంప కేంద్రం (NSC) ప్రకారం.. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదైంది. భూకంప కేంద్ర 20 కిలోమీటర్లు. అంతకుముందు బంగాళాఖాతంలోని జిజాంగ్, టిబెట్, మొరాకోలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం సోమవారం రాత్రి 11:01 గంటలకు సంభవించింది. ప్రస్తుతం ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని NSC నుండి అందిన సమాచారం… జూలై 21న ఉఖ్రుల్‌లో 3.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది.