Tomato Price Today in Madanapalle Market: గత జూన్, జూలై నెలలో టమోటా ధరలు అమాంతంగా పెరిగిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని రీతిలో ఏకంగా కిలో టమోటా ధర రూ. 200 దాటింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అయితే కిలో టమోటా రూ. 250 వరకు పలికింది. ఆగస్టు 10 వరకు ఇదే పరిస్థితి నెలకొంది. దాంతో సామాన్య ప్రజలు టమోటా జోలికే పోలేదు. ప్రస్తుతం సీన్ మొత్తం మారిపోయింది. కొండెక్కిన టమాటా ధరలు…
Huge Fire Accident in Srisailam Temple: నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్‌లో అర్ధరాత్రి దాటాక ఎల్ బ్లాక్ సముదాయంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 15 షాపులు కాలి బూడిదయ్యాయి. అప్రమత్తమైన దేవస్థానం అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది.. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చారు. మల్లన్న ఆలయ సమీపంలోని లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్…
AP Minister RK Roja Slams Chandrababu Naidu and Pawan Kalyan: ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను ఓడించేవాడు ఇంకా పుట్టలేదని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. జగన్‌ను ఓడించాలంటే.. అవతలి వైపు కూడా జగనే ఉండాలన్నారు. ఎమ్మెల్యేగా గెలవలేని వాడు.. జగన్‌ను ఎలా ఓడిస్తాడు అని మంత్రి రోజా ప్రశ్నించారు. ప్రజలందరూ 2024 జగనన్న వన్స్‌మోర్ అంటున్నారని, ఆంధ్ర రాష్ట్రంలోని 175 సీట్లు ఇచ్చి దీవించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ మేరకు నగరి…
1KG Tomato Price Was RS 10 in Kurnool on Friday: రెండు నెలలుగా టమాటా ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. గత నెలలో కిలో టమాటా ధర రూ. 200 నుంచి 240 వరకు పలికి ఆల్‌టైం రికార్డు క్రియేట్ చేసింది. అయితే పెరిగిన టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. వందల ఎకరాల్లో సాగు చేసిన పంట ఒకేసారి చేతికి రావడంతో ధరలు దిగొచ్చాయి. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో…
Student dies after Scorpion sting in Class Room: క్లాస్ రూమ్‌లో తేలు కుట్టి తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద ఘటన డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. చిత్తు పేపర్లు ఏరుతుండగా తేలు కుట్టడంతో ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స కోసం కాకినాడకు తరలిస్తుండగా రక్తపు వాంతులు చేసుకుని చనిపోయాడు. దాంతో విద్యార్థి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరుగుతోంది. గత 5 ఏళ్లుగా ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత మూడేళ్లల్లో అయితే కంగా 18 లక్షల మంది అదనంగా పన్ను చెల్లింపుదారులుగా మారారు.
ఏపీలో పార్టీ విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉనికే లేని ఏపీలో మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డికి కీలకమైన సీడబ్ల్యూసీలో స్థానం కల్పించారు. తెలంగాణకు ప్రత్యేక ఆహ్వానితుల కోటాలో ఇద్దరికి చోటు కనిపించిన ఏఐసీసీ అధిష్టానం.. ఏపీకి మాత్రం సీడబ్ల్యూసీలో శాశ్వత సభ్యత్వాన్ని రఘువీరారెడ్డికి ఇచ్చింది.
Rains To Fall in AP and Telangana due to Low Pressure in Bay of Bengal: 5 రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శుక్రవారం (ఆగష్టు 18) నాటికి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల వర్షాలు కురియగా.. ఆకాశం మొత్తం మేఘావృతం అయి…
Tollywood Actress Sreeleela to inaugurate APL 2023: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) రాష్ట్రం నుంచి నాణ్యమైన ఆటగాళ్లను సిద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)ను నిర్వహిస్తోంది. ఏపీఎల్ రెండో సీజన్‌కు విశాఖపట్నంలోని వైఎస్సార్ స్టేడియం సర్వసన్నద్ధమైంది. ఆగస్టు 16 నుంచి 27 వరకు సీజన్ 2 జరగనుంది. ప్రారంభ మ్యాచ్‌లో తొలి సీజన్ టైటిల్ పోరులో తలపడ్డ బెజవాడ టైగర్స్, కోస్టల్ రైడర్స్ తలపడనున్నాయి. గతేడాది నిర్వహించిన…
Young Man dies with Heart Attack While Playing Cricket in Nandyala: దేశంలో గుండెపోటుతో ఆకస్మిక మరణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటుతో అనధికారికంగా వందలాది మంది మృతి చెందారు. నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి వార్త వినాల్సి వస్తోంది. యువకులు కూడా గుండెపోటుతో చనిపోతుండడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలోని ఓ యువకుడు స్నేహితులతో క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు.…