# నేడు తిరుపతిలో సీఎం జగన్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.50 నిమిషాలకు 684 కొట్లతో నిర్మించిన శ్రీనివాస సేతు ప్లై ఓవర్ ప్రారంభిస్తారు. వర్చువల్‌గా ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ హాస్టల్ భవనం ప్రారంభం సహా టీటీడీ ఉద్యోగులకు ఇళ్ళ స్దల పట్టాల పంపిణీ చేయానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు తాతయ్య గుంట గంగమ్మ ఆలయ దర్శన అనంతరం సీఎం తిరుమల పయనం కానున్నారు.
# నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. 5 రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. నేడు ఉదయం 11 గంటలకు సభ ఆరంభం అవుతుంది. నేడు పార్లమెంట్ ప్రస్థానంపై ఉభయసభల్లో చర్చ జరగనుంది. 75 ఏళ్లలో సాధించిన అభివృద్ధి, పురోగతిపై చర్చ జరుగుతుంది. తొలిరోజు పాత పార్లమెంట్ భవనంలోనే సమావేశాలు జరుగుతాయి.
# నేడు వినాయకచవితి పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరగనున్నాయి. అంగరంగ వైభవంగా కాణిపాకం వినాయకుడికి బ్రహోత్సవాలు జరగనున్నాయి. మంత్రి పెద్ది రెడ్డి ఉదయం 9 గంటలకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
Also Read: Mohammed Siraj: చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఓవర్.. మొహ్మద్ సిరాజ్ బుల్లెట్ బంతుల వీడియో!
# మధ్యాహ్నం 12 గంటలకు ఖైరతాబాద్ మహా గణపతికి తొలిపూజ జరగనుంది. తొలిపూజలో తెలంగాణ గవర్నర్ తమిళిసై పాల్గొంటారు. దశమహా విద్యాగణపతిగా ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం.
# నేటినుంచి శ్రీశైలంలో 9 రోజుల పాటు వినాయకచవితి నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. యాగశాల ప్రవేశంతో వినాయకచవితి నవరాత్రులకు శ్రీకారం.