70 People took selfies in the AP Assembly Visitors’ Gallery: ఏపీ అసెంబ్లీ విజిటర్స్ గ్యాలరీలో కొంతమంది విజిటర్స్ హల్‌చల్ చేశారు. సెల్ఫీలు దిగుతూ నానా హంగామా చేశారు. ఈ తతంగాన్ని సీసీ కెమెరాల్లో గుర్తించిన మానిటరింగ్ సిబ్బంది.. చీఫ్ మార్షల్‌కు సమాచారం ఇచ్చింది. విజిటర్స్ ఫోన్ కెమరాల్లోంచి ఫోటోలు డిలీట్ చేయించిన చీఫ్ మార్షల్.. వారిని బయటకు పంపేశారు. సమావేశాల చివరి రోజులు కావటంతో.. ఏపీ అసెంబ్లీకి పలువురు ఎమ్మెల్యేలు తమ అనుచరులను పెద్ద సంఖ్యలో తీసుకుని వచ్చారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండు రోజుల్లో ముగియనున్నాయి. దాంతో పలువురు ఎమ్మెల్యేలు తమ అనుచరులను పెద్ద సంఖ్యలో అసెంబ్లీ సందర్శనకు తీసుకుని వచ్చారు. దాంతో అసెంబ్లీ లాబీలు సందర్శకులతో కిటకిటలాడాయి. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఏకంగా 70 మంది అనుచరులను అసెంబ్లీ సందర్శనకు మంగళవారం తీసుకొచ్చారు. సందర్శకుల తాకిడితో మార్షల్స్ తలలు పట్టుకున్నారు.
Also Read: CM YS Jagan: సీఎం జగన్ వల్ల నా చిన్ననాటి కల నెరవేరింది: ఎమ్మెల్యే
విజిటర్స్ గ్యాలరీలో కొంతమంది హల్‌చల్ చేయడంతో వారిని మార్షల్స్ అడ్డుకోలేపోయారు. సెల్ఫీలు దిగుతూ హంగామా చేసిన వారిని చీఫ్ మార్షల్ బయటికి పంపేశారు. సెల్‌ఫోన్‌లలో బంధించిన ఫోటోలు డిలీట్ చేయించి.. మరి బయటకు పంపారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు.