పీఆర్సీపై ఏపీలో దుమారం రేగుతోంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం 11వ పీఆర్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పీఆర్సీ పై ఉద్యోగసంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం వద్దు కానీ.. ఆర్టీసీ ఆదాయం మాత్రం కావాలా..? అని ఆయన ప్రశ్నించారు. పీటీడీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు.. ప్రమోషన్లు తక్షణం చేపట్టాలని అన్నారు. ఆర్టీసీ ఆస్పత్రులన్నీ అప్డేట్ చేయాలని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పేరు…
ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ పై ఉద్యోగ సంఘాల నేతలు విముఖతతో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉద్యోగ సంఘాల నేతలు ఏకతాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన సమితి గా ఏర్పడి సమ్మెకు సిద్ధమయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలను బుజ్జగించేందుకు మంత్రులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు రావాలంటూ ఆహ్వానించినప్పటికీ ఉద్యోగ సంఘాల నేతలు చర్చకు రావడం లేదు మంత్రుల కమిటీ వెల్లడిస్తోంది. ఈ…
సీపీసీని అమలు చేస్తున్నారా..? అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదికను అమలు చేస్తున్నారా..? ఆఫీసర్స్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తున్నారా..? ఏపీలో అమలు చేయాలనుకుంటోంది ఏ పీఆర్సీ అని పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. దేన్ని అమలు చేస్తున్నారో చెబితే మేం చర్చలకు సిద్దమని ఆయన స్పష్టం చేశారు. సీపీసీని అమలు చేస్తే.. అందులో ఉన్న మిగిలిన అంశాలనూ అమలు చేస్తారా..? అని ఆయన అన్నారు. ప్రభుత్వ కమిటీ మీద…
పీఆర్సీ విషయంలో గందరగోళం ఉంది కాబట్టి ప్రస్తుతానికి పాత జీతాలే ఇవ్వాలని సీఎస్ ను కోరామని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. కానీ సీఎస్ ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం వేసిన సంప్రదింపుల కమిటీకి మా స్టీరింగ్ కమిటీ బృందం వెళ్లి లేఖ ఇచ్చింది.. దానికీ సమాధానం లేదని ఆయన తెలిపారు. సమాధానాలు చెప్పకుండా.. మమ్మల్ని తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చర్చలకు వెళ్లమని మాపై ఒత్తిడి తేవాలని…
ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన పీఆర్సీపై విముఖత తో ఉన్న ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి. ఉద్యోగ సంఘాల నేతలు ఏకతాటిపై వచ్చి పీఆర్సీ సాధన కమిటీ గా ఏర్పడి సమ్మెకు సిద్ధమయ్యారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలను బుజ్జగించేందుకు ఏపీ ప్రభుత్వం మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అయితే మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించినప్పటికీ ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం చర్చకు రాలేదు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల…
ఉద్యోగులతో చర్చలు జరపడానికి మేం సిద్దంగా ఉన్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పీఆర్సీ విషయంలో అపోహలు తొలగించేందుకు సిద్దంగా ఉన్నామని, అవసరమైతే ఓ నాలుగు మెట్లు దిగడానికైనా సిద్దమన్నారు. చర్చలతో సమస్యలు పరిష్కారం అవుతాయని, పరిస్థితి సమ్మె వరకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. రేపట్నుంచి ప్రతి రోజూ 12 గంటలకు అందుబాటులో ఉంటామని, పీఆర్సీ సాధన సమితి నేతలే కాదు.. మిగిలిన ఉద్యోగ సంఘాల నేతలెవరు వచ్చిన చర్చలకు సిద్దమేనని ఆయన వెల్లడించారు. చర్చలకు…
ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్సీపై గందరగోళం నెలకొంది. చరిత్ర ఇటువంటి పీఆర్సీ ప్రకటన చూడలేదని, న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే పీఆర్సీపై ఉద్యోగ సంఘాలను నచ్చజెప్పేందుకు ఏపీ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఉద్యోగ సంఘాలు పీఆర్సీలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని తెలిపేందుకు ఈ కమిటీ ఉద్యోగ సంఘాల నేతలను ఈరోజు చర్చకు ఆహ్వానించింది. అయితే కమిటీ ఇచ్చిన ఆహ్వానాన్ని ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. అయితే…
పీఆర్సీపై ఏపీలో పెను దుమారం లేస్తోంది. ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్ధం చేసుకోవాలని అధికార వైసీపీ నేతలు అంటుంటే.. ఇలాంటి పీఆర్సీని చరిత్రలో చూడలేదంటూ ఉద్యోగులువాపోతున్నారు. 11వ పీఆర్సీని రద్దు చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని సవాల్ చేస్తూ ఉద్యోగ సంఘాలు హై కోర్టు ను ఆశ్రయించారు. ఈ క్రమంలో పీఆర్సీ జీవోలు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై నేడు ఏపీ…
ఏపీలో 11వ పీఆర్సీపై రచ్చ జరుగుతోంది. ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అంతేకాకుండా తమ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామన్నారు. ప్రభుత్వం తమ సమస్యలపై చెప్పుకునేందుకు సమయం ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ఉద్యోగ సంఘ నేతలకు జీఏడీ సెక్రటరీ శశి భూషణ్ ఫోన్ చేసి రేపు మంత్రులతో చర్చలకు హాజరు కావాలని ఆహ్వానించారు. ఉద్యోగ సంఘాల నాయకులతో సంప్రదింపులకు…
పీఆర్సీ విషయంలో ప్రభుత్వం మొండివైఖరిపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. పీఆర్సీపై ఉద్యోగ సంఘాల భవిష్యత్ కార్యాచరణ పై కీలకంగా చర్చలు జరిగాయి. అన్ని సంఘాలు ఏకాభిప్రాయంతో నిర్ణయానికి వచ్చాయి. సమ్మె నోటీసులో పీఆర్సీ, అనుబంధ అంశాలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు పొందుపరుస్తామన్నారు. వైద్యారోగ్యశాఖ విషయాలను, అక్కడ వున్న కార్మిక చట్టాలకు అనుగుణంగా సమ్మెకు దిగుతారని ఉద్యోగ సంఘాల నేతలు మీడియాకు వివరించారు. 7వ తేదీ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులంతా కలిసి నిరసనకు దిగుతారన్నారు. పాత జీతం ఇవ్వాలని…