ఏపీలో పీఆర్సీపై రగడ సాగుతోంది. ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన 11 పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. రెండో రోజు ముఖ్యమంత్రితో చర్చలు జరుగలేదని, ఆ రోజు మాకు మాట్లాడే అవకాశం రాలేదన్నారు. ముఖ్యమంత్రి పీఆర్సీపై తన ప్రకటన చేసి వెళ్ళి పోయారని, ప్రభుత్వంతో మాకు ఎటువంటి ఒప్పందం లేదని, మేము ఎక్కడా సంతకాలు పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. పీఆర్సీ…
ఏపీలో పీఆర్సీ రగడ జరుగుతోంది. పీఆర్సీ జీవోల పై భగ్గు మంటున్న ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణకు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. జీవోలు రద్దు చేసే వరకు ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళే ప్రసక్తే లేదు. మా డీఏలు మాకు ఇచ్చి జీతంలో సర్దుబాటు చేయడం ఉద్యోగులను మోసం చేయడమే అన్నారు. 10 వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని సీఎస్ చెప్పిన లెక్కలన్నీ బోగస్ అని విమర్శించారు. కేంద్ర పే…
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను సంతృప్తి పరచాలేకానీ… బ్లాక్ మెయిల్ చేయడం తగదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. తిరుపతిలోని స్థానిక బైరాగి పట్టెడలో ఉన్న సీపీఐ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతం దాల్చుతున్న నేపథ్యంలో ఖమ్మం నందు ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్ ఉద్యమ విరమణకు ప్రయత్నించగా తెలంగాణ ప్రజలు, ఊస్మానియా వర్శిటీ విద్యార్థులు తిరగబడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో…
పీఆర్సీపై ఏపీలో ఇంకా స్పష్టత నెలకొనలేదు. ఇటీవలే సీఎం జగన్ పీఆర్సీని ప్రకటించారు. అయితే పీఆర్సీపై ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా లేదని, సమ్మెకు వెళ్తామని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ఈ సందర్బంగా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. పీఆర్సీపై కొన్ని ఉద్యోగ సంఘాలు పాజిటివ్‌గా, కొన్ని వ్యతిరేకంగా మాటాడుతున్నాయని ఆయన అన్నారు. ఉద్యోగులు సంతృప్తికరంగా, ఆనందంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. ఎక్కడొ కొన్ని సంఘాలు ఎవరో కొంతమంది వెనుకనుండి ప్రోద్బలం వలన సమ్మెకు వెళ్తామనడం ఆలోచించాల్సిన విషయమన్నారు.…
పీఆర్సీ ప్రకటన తర్వాత జీతాలు తగ్గుతాయని ఉద్యోగుల్లో ఆందోళన రేగిన మాట వాస్తవనని ఏపీ ఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి అన్నారు. పీఆర్సీ ప్రకటన తర్వాత 4 శాతం నష్టపోయినా హెచ్ఆర్ఏ ప్రస్తుతం కొనసాగుతున్న విధంగా ఉంటే ఇబ్బంది లేదని ఆయన పేర్కొన్నారు. అధికారుల కమిటీ సిఫార్సులను అమలు చేస్తే ఉద్యోగులు నష్టపోవాల్సిందేనని, ఇదే విషయాన్ని సీఎంఓ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డికి వివరించి చెప్పామన్నారు. పీఆర్సీ ప్రకటన తర్వాత గ్రామ వార్డు సచివాలయాల్లో కొందరు అపోహలు పడుతున్నారని…
ఉద్యోగుల పీఆర్సీతో పాటు హెల్త్ కార్డుల విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దుపై నియమించిన కమిటీ నివేదిక అందింది జూన్ లోగా దీనిపై సహేతుకమైన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. పెరిగిన పీఆర్సీ, 5 డీఏ బకాయిలు అన్ని ఆర్థిక ప్రయోజనాలు జనవరి 2022 నుంచే చెల్లిస్తామని తేల్చి చెప్పారని. 1.28 లక్షల మంది గ్రామ…
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ఓ టైమ్ లైనులో ప్రకటిస్తాం.. పరిష్కరిస్తామని సీఎం చెప్పారని జేఏసీల ఐక్య వేదిక ప్రతినిధి బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల్లో కొంత మేర మిశ్రమ స్పందన వచ్చిందని, అయినా ఉద్యోగులకు సంబంధించిన వివిధ సమస్యల పరిష్కారానికి టైమ్ బౌండ్ పెట్టడం సంతోషమన్నారు. హెచ్‌ఆర్ఏ, పెన్షనర్లకు అదనపు పెన్షన్ విషయంపై సీఎంఓ అధికారులతో మాట్లాడామని, హెచ్‌ఆర్ఏ, అదనపు పెన్షన్ విషయంలో సీఎస్ కమిటీ సిఫార్సులను పట్టించుకోవద్దని కోరామన్నారు. హెచ్‌ఆర్ఏ విషయంలో…
ఎన్ని రోజుల నుంచి ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పీఆర్పీ ప్రకటనపై తెరపడింది. ఈ రోజుల సీఎం జగన్ పీఆర్సీపీపై ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పీఆర్సీ విషయానికి క్లారిటీ ఇచ్చామని, ఎన్నికల్లో చెప్పినట్టుగానే 27 శాతం ఐఆర్ ఇవ్వడం చరిత్ర అని ఆయన అన్నారు. శతాబ్దంలోనే జరగని పరిణామాలు, నష్టాలు కోవిడ్ వల్ల వచ్చాయని ఆయన అన్నారు. 2020 నుంచి 2022 వరకు కోవిడ్ ప్రభావం ఉంది.. ఈ ఏడాది కూడా…
ఏపీపీఆర్సీపీపై సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అధికారులు కమిటీ ఇచ్చిన ఫిట్‌మెంట్‌ను వ్యతిరేకించినట్లు ఆయన వెల్లడించారు. గత పది పీఆర్సీల్లో ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ తగ్గలేదని, హెచ్ ఆర్ఏ పై అసంబద్ధంగా అధికారులు నిర్ణయం తీసుకున్నారన్నారు. విశాఖ, విజయవాడ, నెల్లూరు టౌన్ లో తప్ప ఎక్కడా 16 శాతం హెచ్ఆర్ఏ వర్తించదని, పెన్షనర్లకు సంబంధించి 70 ఏళ్లకు అదనపు…