పీఆర్సీ విషయంలో గందరగోళం ఉంది కాబట్టి ప్రస్తుతానికి పాత జీతాలే ఇవ్వాలని సీఎస్ ను కోరామని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. కానీ సీఎస్ ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం వేసిన సంప్రదింపుల కమిటీకి మా స్టీరింగ్ కమిటీ బృందం వెళ్లి లేఖ ఇచ్చింది.. దానికీ సమాధానం లేదని ఆయన తెలిపారు. సమాధానాలు చెప్పకుండా.. మమ్మల్ని తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చర్చలకు వెళ్లమని మాపై ఒత్తిడి తేవాలని ఉద్యోగులను సజ్జల కోరుతున్నారన్నారు. సజ్జల చుట్టూ చర్చల కోసం మేం తిరగలేదా..? ప్రతి అంశం పైనా సజ్జల మాతో చర్చింది వాస్తవం కాదా..?మధ్యంతర భృతిని వెనక్కు తీసుకున్నది వాస్తవం కాదా..?అని అన్నారు.
మేం అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా.. మేం మెచ్యూర్డుగా వ్యవహరించ లేదని సజ్జల అంటారా..? మేం సజ్జలతో చర్చలు జరిపినప్పుడు.. మేం మెచ్యూర్డో.. ఇమ్మేచ్యూర్డో తెలీదా..? ఇది చాలదన్నట్టు మరిన్ని ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతామంటారా..? ఇంకెన్ని సంఘాలను చీలుస్తారు..? మా ఉద్యోగులు మమ్మల్ని విమర్శిస్తోన్నా.. సమస్య పరిష్కారం కోసం మేం చర్చలకు రాలేదా..? అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల నేతలను కించ పరచవద్దు. స్టీరింగ్ కమిటీ బృందం నేతలు కాదా..? మీతో చర్చలు జరపలేదా అని ఆయన వ్యాఖ్యానించారు.