పీఆర్సీపై ఏపీలో పెను దుమారం లేస్తోంది. ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్ధం చేసుకోవాలని అధికార వైసీపీ నేతలు అంటుంటే.. ఇలాంటి పీఆర్సీని చరిత్రలో చూడలేదంటూ ఉద్యోగులువాపోతున్నారు. 11వ పీఆర్సీని రద్దు చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని సవాల్ చేస్తూ ఉద్యోగ సంఘాలు హై కోర్టు ను ఆశ్రయించారు. ఈ క్రమంలో పీఆర్సీ జీవోలు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది.
సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడంపై ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య కోర్టులో పిటిషన్ వేశారు. విభజన చట్టం ప్రకారం ఎలాంటి బెనిఫిట్స్ తగ్గకూడదని పిటిషన్ లో కృష్ణయ్య పేర్కొన్నారు. సెక్షన్ 78(1) కి విరుద్ధంగా ఉన్న జీవో 1 ని రద్దు చేసేలా అదేశాలివ్వాలని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టులు వెల్లడించారు. ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, ఫైనాన్స్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీలు, కేంద్ర ప్రభుత్వం, పే రివిజన్ కమిషన్ ను పిటిషనర్ చేర్చారు.