గుడివాడలో రేపు జరగాల్సిన కృష్ణా జిల్లా మహానాడు వాయిదా పడింది. ఏపీలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. వర్షాల వల్ల మహానాడు సభకి అంగలూరు గ్రౌండ్స్ అనుకూలంగా లేదు. దీంతో మూడు రోజుల పాటు చేపట్టాలనుకున్న కృష్ణా జిల్లా టూర్ వాయిదా వేసుకున్నారు చంద్రబాబు. కృష్ణా జిల్లా మహానాడు వాయిదా కారణంగా రాజంపేట జిల్లాలో మహానాడు నిర్వహణను వాయిదా వేసుకుంది టీడీపీ.
మరోవైపు చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. గుడివాడలో చంద్రబాబుకు వాతావరణమే కాదు ప్రజలు కూడా సహకరించరు. ఎన్టీఆర్ ఆత్మ ఊరుకుంటుందా?? ఇక్కడ నిలబెట్టడానికి చంద్రబాబుకు అభ్యర్థి కూడా దొరకడు. మద్యం శాంపిళ్ళలో టీడీపీ వాళ్ళు ఏం కలిపి పరీక్షల కోసం తీసుకుని వెళ్ళారో తెలీడం లేదన్నారు. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఏమైనా చేస్తాడు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చేయమనా? వద్దనా?? చంద్రబాబు స్టాండ్ ఏంటి?? చెప్పాలన్నారు.
అమరావతి అభివృద్ధికి నిధులు అవసరం లేదు…ఇక్కడి భూములు అమ్మితే చాలు అని చంద్రబాబు ఎన్ని సార్లు చెప్పలేదు?? క్వార్టర్స్ ఖాళీగా ఉంచితే వాటిని కట్టడానికి చంద్రబాబు చేసిన అప్పులకు వడ్డీలు ఎలా కట్టాలన్నారు పేర్ని నాని. ఇదిలా వుంటే టీడీపీ నేతలు సైతం వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. టీడీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాజీ మంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. 2024 ఎన్నికలే వైసీపీకి చివరివన్నారు. తలకిందులుగా తపస్సు చేసినా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ గెలవదన్నారు. శివకుమార్ పెట్టిన వైసీపీ పార్టీని జగన్ కబ్జా చేశారని విమర్శించారు. సొంత తల్లి, చెల్లిని రాజకీయాల కోసం ఉపయోగించుకున్నారని, అధికారంలోకి రాగానే వాళ్లను బయటకు గెంటేశాడని ఆరోపించారు.
చంద్రబాబుకు ప్రకృతి సహకరించదన్నారు మరో మాజీ మంత్రి కొడాలి నాని. ఎవరైనా చిన్న కర్మ చేసిన తర్వాత పెద్ద కర్మ చేస్తారు. మహానాడు తర్వాత మినీ మహానాడు చేయటం చంద్రబాబు తెలివి తక్కువ తీరుకు నిదర్శనం. ఎన్టీఆర్ ఆత్మే వాతావరణం మార్చి మహానాడు జరగకుండా చేసింది. తనను దేవుడిలా కొలిచే కొడాలి నానిని ఓడిస్తానని చంద్రబాబు చెప్పడాన్ని ఎన్టీఆర్ ఆత్మ ఎలా భరిస్తుంది?? అన్నారు నాని.
Rain Alert : హైదరాబాద్‌కు మరో గంటలో భారీ వర్ష సూచన