మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను చూసి జగన్ ఓర్వలేకపోతున్నాడు.. ఈనెల 11వ తేదీ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడితే జగన్ రాయలసీమ బిడ్డగా ఒప్పుకుంటామని మంత్రి పేర్కొన్నారు. విలాసవంతమైన భవనాల్లో గడిపే జగన్‌కు.. చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని తెలిపారు. మాజీ మంత్రులు రోజా, అంబటి, పేర్ని నాని, కొడాలి నానిలు తీసేసిన తహశీల్దార్లు అని విమర్శించారు. ప్రజాధనం దోచేసిన మాజీ మంత్రుల అవినీతిపై విచారణ జరుగుతోందని.. మాజీ మంత్రులందరూ జైలుకెళ్ళడం ఖాయమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
Read Also: CM Revanth: యాదాద్రి కాదు యాదగిరిగుట్టే.. రికార్డులు మార్చండి
ఫిలిం ఛాంబర్‌లో వృద్ధాప్య పెన్షన్‌కు రోజా ధరఖాస్తు చేసుకోవాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. రోజా దరఖాస్తు చేసుకున్న వెంటనే వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని కామెంట్స్ చేశారు. మంత్రిగా ప్రజాధనాన్ని దోచేసిన రోజా.. పక్క రాష్ట్రాల్లో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తోందని తెలిపారు. నందమూరి తారక రామారావు తర్వాత రాజకీయాల్లో ఆ స్థాయిలో రాణిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవలను ప్రజలు మెచ్చుకుంటున్నారు.. వారు చేసిన శాఖల గురించి అవగాహన లేని మాజీ మంత్రులు కూడా పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తుండడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. మరోవైపు.. మదనపల్లె ఫైళ్ళ దగ్ధం కేసుపై విచారణ జరుగుతోందని మంత్రి తెలిపారు.
Read Also: Nithin Chauhan: ప్రముఖ నటుడు ఆత్మహత్య?