1.ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. రష్యా దళాలను ఉక్రెయిన్ సేనలు అడ్డుకుంటున్నాయి. ఉక్రెయిన్ దళాలతో పాటు ప్రజలు కూడా రష్యా సేనలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే రష్యా కీలక నగరాలను స్వాధీనం చేసుకున్నది. రష్యా సైన్యానికి అండగా పుతిన్ ప్రపంచాన్ని భయపట్టే బాంబును బయటకు తీస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ బాంబుపేరు ఫాథర్ ఆఫ్ ఆల్ బాంబ్స్. 2.రాబోయే రోజుల్లో నీటికొరతను నివారించేందుకు, భవిష్యత్ తరాల కోసం నదుల్ని పరిరక్షించాల్సిన అవసరం వుందన్నారు మంత్రి…
ఎన్టీఆర్ కేంద్రంగా కృష్ణా జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఎన్టీఆర్ పేరు.. ఎన్టీఆర్ ఊరు అనే కాన్సెప్ట్‌తో వైసీపీ అడుగులు పడుతున్నాయి. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడుతున్నారు. తాజాగా నిమ్మకూరులో ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం రాజకీయాల్లో చర్చగా మారింది. నిమ్మకూరులో ఎన్టీఆర్ భారీ విగ్రహానికి వైసీపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్NTR.. కృష్ణా జిల్లాలో ఈ పేరు చుట్టూనే రాజకీయం జరుగుతోంది. ఎన్టీఆర్‌ను ఎవరికి వారు ఓన్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.…
వాళ్లంతా ఢిల్లీ సభకు ప్రతినిధులు. రాష్ట్ర అభివృద్ధికి వారథులు. లక్షల మంది ఆకాంక్షలను నెరవేర్చే అవకాశం ఉంది. జాతీయస్ధాయిలో ముఖ్యనేతలను కదిలించే సత్తా ఉంది. వాళ్లు మాత్రం తాము నిమిత్త మాత్రులమే అంటున్నారు. దీంతో జనం వాళ్లను మర్చిపోయారని చర్చ నడుస్తోంది. వన్‌టైం పొలిటిషన్ల కింద లెక్కగట్టి లైట్ తీసుకుంటున్నారట. ఇంతగా వీకైపోయిన ఆ ప్రజాప్రతినిధులు ఎవరు? ఏమా కథా? రియల్‌టైమ్ రాజకీయ నేతలుగా మారలేదా?ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు ఎంపీలు చాలా పవర్ఫుల్. పాలిటిక్స్ అన్నీ వాళ్ల…
1 ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ వేగం పెంచింది. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వైఎస్ వివేకా హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యపై ఇక విచారణే అవసరం లేదని, వివేకాను చంపిందెవరో ఇప్పటికే తేలిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. వివేకాను చంపిందెవరో అందరికీ తెలిసిపోయిందని, ఆ హత్యకు వైఎస్ కుటుంబీకులే నైతిక బాధ్యత…
1 ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ఇంకా స్పష్టత నెలకొనలేదు. దీంతో తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్నా సినిమాలపై భారం పడే అవకాశం ఉంది. అయితే ఈనెల 25న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లానాయక్’ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతున్న వేళ.. ఏపీలో జీవో 35 ప్రకారమే సినిమా టికెట్లు విక్రయించాలని నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ సినిమాలపై కక్ష…
ఏపీలో అధికార విపక్షాల మధ్య విమర్శలు కొనసాగుతూనే వున్నాయి. మా మంత్రి చనిపోయిన షాక్ లో మేముంటే ఆయనపై కూడా నీచంగా మాట్లాడుతున్నారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడటం దుర్మార్గం అన్నారు చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. రాష్ట్రంలో ఒక ప్రజా పరిపాలన కొనసాగుతుంటే దాన్ని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారు. కరకట్ట పై అక్రమంగా నివాసం ఉంటూ దాన్ని కుట్ర కోటగా మార్చాడు. అత్యున్నత సంస్థ దర్యాప్తు కొనసాగుతోంది…దాన్ని మేము కూడా ఆహ్వానించాం. కానీ దర్యాప్తులో…
1.తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు మల్లన్నసాగర్‌ను సీఎం కేసీఆర్ బుధవారం నాడు జాతికి అంకితం చేశారు. సిద్ధిపేట జిల్లాలో మల్లన్నసాగర్ ప్రాజెక్టును ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ… తెలంగాణకు కరవు రాకుండా చేసే ప్రాజెక్టే కాళేశ్వరం అని పేర్కొన్నారు. దేశమంతా కరవు వచ్చినా ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు మాత్రం రాదని కేసీఆర్ అన్నారు. మల్లన్నసాగర్ ప్రారంభంతో కాళేశ్వరం కల సాకారమైందన్నారు. 2.మేకపాటి గౌతం రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలోని మేకపాటి…
మాజీ మంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఢిల్లీ పెద్దలదే అన్నారు టీడీపీ నేత బోండా ఉమా. గతంలో జయలలిత కేసు కర్ణాటకలో విచారణ జరిగినట్లు వివేకా హత్య కేసు విచారణ వేరే రాష్ట్రంలో చేపట్టాలి. వివేకా హత్య కేసు నిందితుల్ని కాపాడేందుకు వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థల్ని సైతం నాశనం చేసే తీరు చూసి దేశం మొత్తం నివ్వెరపోతోంది. బాబాయ్ హత్యకేసు వెలికితీస్తున్న సీబీఐ అధికారులపై పోలీసులతో కేసు…
తూర్పుగోదావరి జిల్లాలో అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం యమరంజుగా వుంటుంది. తాజాగా ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా టీడీపీ నేత బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలను ఖండించిన ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బండారు సత్యనారాయణ ఒక బడుద్ధాయి అనేశారు రాజా. టీడీపీ నేతలు శవాల దగ్గర నెత్తురుకూడు తినే సన్నాసులు అని విప్ దాడిశెట్టి రాజా అన్నారు. రాష్ట్రంలో తెలుదేశం పార్టీకి తాడు…
1.తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ తరహాలో మాటల తూటాలు పేలుతుంటాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ పాలనపై మండిపడుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మీ ప్రభుత్వంలో వీఆర్ఒల పరిస్థితి కట్టు బానిసల కంటే హీనంగా తయారైందన్నారు రేవంత్. గొడ్డు చాకిరీ చేయించుకుని… వాళ్ల హక్కులను కాలరాస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. 2.తెలంగాణ మీద కక్ష తోనే కేంద్రం సహకరించడం లేదని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.…