మాజీ మంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఢిల్లీ పెద్దలదే అన్నారు టీడీపీ నేత బోండా ఉమా. గతంలో జయలలిత కేసు కర్ణాటకలో విచారణ జరిగినట్లు వివేకా హత్య కేసు విచారణ వేరే రాష్ట్రంలో చేపట్టాలి. వివేకా హత్య కేసు నిందితుల్ని కాపాడేందుకు వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థల్ని సైతం నాశనం చేసే తీరు చూసి దేశం మొత్తం నివ్వెరపోతోంది. బాబాయ్ హత్యకేసు వెలికితీస్తున్న సీబీఐ అధికారులపై పోలీసులతో కేసు…
తూర్పుగోదావరి జిల్లాలో అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం యమరంజుగా వుంటుంది. తాజాగా ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా టీడీపీ నేత బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలను ఖండించిన ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బండారు సత్యనారాయణ ఒక బడుద్ధాయి అనేశారు రాజా. టీడీపీ నేతలు శవాల దగ్గర నెత్తురుకూడు తినే సన్నాసులు అని విప్ దాడిశెట్టి రాజా అన్నారు. రాష్ట్రంలో తెలుదేశం పార్టీకి తాడు…
1.తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ తరహాలో మాటల తూటాలు పేలుతుంటాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ పాలనపై మండిపడుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మీ ప్రభుత్వంలో వీఆర్ఒల పరిస్థితి కట్టు బానిసల కంటే హీనంగా తయారైందన్నారు రేవంత్. గొడ్డు చాకిరీ చేయించుకుని… వాళ్ల హక్కులను కాలరాస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. 2.తెలంగాణ మీద కక్ష తోనే కేంద్రం సహకరించడం లేదని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.…
ఆ ప్రాంతంలో జిల్లా విభజనపై ఒక రేంజ్లో ఉద్యమం జరుగుతుంటే.. ఒక మంత్రి.. ప్రతిపక్షపార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మాత్రం సైలెంట్ అయ్యారు. మొన్నటి వరకు మాకు ఓటేయండి.. మన ఊరిని జిల్లా కేంద్రం చేయిస్తామని హామీలు ఇచ్చిన నేతలు ఇప్పుడు నోరు మెదపడం లేదు. నేతలను కదిపితే నోకామెంట్ అంటున్నారట. ఆ ప్రాంత నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు? మున్సిపల్ ఎన్నికల్లో పెనుకొండే ప్రచార అస్త్రం అనంతలో జిల్లాల విభజనపై జరుగుతున్న రచ్చ అంతా ఇంతా…
నవ్వి పోవుదురుగాక నాకేంటి అనే చందాన ఉంది ఆ ఇద్దరు నేతల తీరు. చీకటి ఒప్పందం చేసుకుని కంకర కోసం కొండలు మాయం చేస్తున్నారట. ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొట్టి సొంత ఖజానా నింపుకొంటున్నారట. వారెవరో.. ఏంటో.. లెట్స్ వాచ్..! ప్రశ్నించేవాళ్లు లేరు.. నేతలదే రాజ్యం కడప జిల్లా జమ్మలమడుగులో అక్రమ మైనింగ్ యధేచ్చగా జరుగుతోంది. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు.. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ఒప్పందం కుదిరిందట. దానిని ప్రశ్నించేవారే లేకపోవడంతో వాళ్లదే రాజ్యం.…
తనను డీజీపీగా ఎంపికచేసి చాలా పెద్ద బాధ్యత అప్పగించారన్నారు కే.రాజేంద్రనాథ్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. తన పై ఇంత నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి జగన్ కి ధన్యవాదాలు. జిల్లా స్థాయి పోలీసు అధికారులు కూడా గురుతర బాధ్యత వహించాల్సి ఉంటుంది. కింది స్థాయి సిబ్బందికి ఆ విధంగా దిశానిర్దేశం చేయాలి. ప్రజలకు పోలీసుల పై భారీ అంచనాలు ఉంటాయి. ప్రజల ధనప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు డీజీపీ.…
జగన్ మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో మునుపెన్నడూ లేని ఆర్దిక సంక్షోభం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. సీఎం జగన్ అహంభావం, చేతగానితనం, మొండితనంతోనే ఈ అనర్ధం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై ప్రభుత్వం నిజాలను తొక్కి పెడుతోంది. బహిరంగ మార్కెట్ రుణాలతో సహా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 3 ఏళ్లలో టీడీపీ హయాం కంటే రూ 86,865 కోట్లు అధికం.కేంద్ర నిధులు కూడా కలిపితే రాష్ట్ర…
ఏపీలో వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు టీడీపీ నేతలు. తాజాగా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే ద్వారంపూడిలపై మండిపడ్డారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి. మంత్రి కొడాలి నాని, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిలు కలిసి పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని కొల్లగొడుతూ భారీ అవినీతికి పాల్పడుతున్నారు. గోడౌన్ల నుంచి రేషన్ బియ్యాన్ని దోచుకుని కాకినాడ పోర్టు ద్వారా పశ్చిమ ఆఫ్రికాలోని ఐవరీ కోస్టుకు తరలిస్తున్నారు. రేషన్ దుకాణాల వ్యవస్థను నిర్వీర్యం చేసి బియ్యాన్ని కొడాలి నాని, ద్వారంపూడిలు…
బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ విజయవాడ పోలీసులకు పట్టుబడ్డ తన అనుచరులను విడిపించుకునేందుకు అర్దరాత్రి సమయంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఎంపీ సమక్షంలోనే ఆయన అనుచరులు పోలీసులపట్ల దురుసుగా ప్రవర్తించడం హాట్ టాపిక్ గా మారింది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఆయన అనుచరుల తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. విజయవాడలో నిన్న అర్ధరాత్రి ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న ముగ్గురు యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.…
అసలే ఆళ్లగడ్డ. రాజకీయాలు ఓ రేంజ్లో ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్నాళ్లు పొలిటికల్ సందడి తగ్గినా.. ఒక్కసారిగా హైఓల్టేజ్..! పదునైన విమర్శలు.. సవాళ్లు..ఆరోపణలు ఆళ్లగడ్డను అట్టుడికిస్తున్నాయి. ఎందుకిలా? అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? రోడ్ల విస్తరణపై ఆళ్లగడ్డలో రాజకీయ సెగలుకర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ రాజకీయంగా కాక రేపుతోంది. భూమా, గంగుల కుటుంబాల మధ్య ఇప్పటికే రాజకీయంగా విభేదాలు భగ్గుమంటున్నాయి. రోడ్ల విస్తరణలో భాగంగా చేపట్టిన పనులు ఆ విభేదాలకు మరింత ఆజ్యం…