YS Jagan: రేపు మాజీ సీఎం వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా పర్యటన ఖరారైంది.. అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలను పరిశీలించనున్నారు. తాజాగా జగన్ పర్యటన షెడ్యూల్ విడుదల చేశారు.. రేపు ఉదయం 9.20 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరుతారు. 9.50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు..10.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 11 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు.. 11.30 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు నుంచి…
Twist in Mulakalacheruvu Fake Liquor Case: ములకలచెరువు నకిలీ మద్యం తయారి కేసులో ట్విస్ట్ నెలకొంది. నిందితుడు జనార్దన్ వైసీపీకి చెందిన రాంమోహన్ గోడన్ ను అద్దెకు తీసుకోని మద్యం తయారీ యూనిట్ ఏర్పాటు చేసినట్లు తేలింది. గూడుపల్లికి చెందిన రాంమోహన్ వైసీపీలో యాక్టివ్ కార్యకర్త.. గతంలో అర్ కె డాబా పేరుతో హోటల్ నిర్వహించాడు. హైవే మార్పు చేయడంతో హోటల్ కు కష్టమర్లు రాకపోవడంతో మూసివేశాడు. జయచంద్రారెడ్డి సూచనతో అద్దెపల్లికి దాన్ని అద్దెకు ఇచ్చాడు.…
Nimmala Ramanaidu: 2026 మే నెల చివరి వరకు 28,946 మందికి రూ. 900 కోట్లతో పునరావాసం కల్పిస్తామని ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. 2027 మార్చి వరకు పోలవరం నిర్వాసితులను పునరావాసం పూర్తి చేస్తామని తెలిపారు. పడకేసిన పోలవరం పనులను కార్యరూపం దాల్చేలా పనిచేస్తున్నామన్నారు. తాజాగా ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్‌తో భేటీ అయ్యారు.
Minister Nara Lokesh Attends Fan Wedding: తమ పెళ్లికి రావాలని ఓ మహిళా అభిమాని పంపిన ఆహ్వానాన్ని మన్నించారు మంత్రి లోకేష్ .. గతంలో చేపట్టిన యువగళం పాదయాత్రలో భాగంగా 2023 ఆగస్టు 20వ తేదీన యువనేత నారా లోకేష్ విజయవాడలో పాదయాత్ర నిర్వహించారు... విజయవాడ మొగల్రాజపురానికి చెందిన భవానీ అనే యువతి ఆనాటి పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు.. యువగళం యాత్ర ద్వారా లోకేష్ అభిమానిగా మారిన భవ్య.. తన పెళ్లికి విచ్చేసి ఆశీర్వదించాలంటూ ఇటీవల…
Balakrishna: ఏపీ బ్రాండ్ సీఎం చంద్రబాబు అని హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయన్నారు. అందుకే చంద్రబాబు 24 గంటలు పనిచేస్తున్నారని తెలిపారు. తాజాగా విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అనుభవంతో రాష్ట్రం దేశ పటంలోనే సువర్ణ అక్షరాలతో లికించబడుతుందని కొనియాడారు. ఆధ్యాత్మికం, పర్యాటకం మిళితమైన కార్యక్రమని..