ఏపీ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ చుక్కలు చూపిస్తున్నాడు. బత్తుల ప్రభాకర్ పరారీ వ్యవహారం పోలీసులకు పెను సవాలుగా మారింది. ఈ నెల 22న రిమాండ్ పొడిగింపు కోసం ప్రభాకర్‌ను పోలీసులు బెజవాడలో కోర్టుకు తీసుకువచ్చారు. తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తుండగా.. దేవరపల్లి దగ్గర ప్రభాకర్ పరారయ్యాడు. ప్రభాకర్‌ను పట్టుకోవటం కోసం బెజవాడ, పశ్చిమ గోదావరి నుంచి 5 బృందాలు ఏర్పాటు చేశారు. Also Read: Suryakumar Yadav: ఐపీఎల్‌లో పరుగుల వరద..…
చంద్రబాబు బానే ఉంటారు.. భవిష్యత్తులో పోలీసు అధికారులు ఇబ్బందులు పడతారని హెచ్చరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. ఏపీ లిక్కర్ స్కామ్ అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో ఇవాళ అనంతపురం వైసీపీ నేతలు ములాఖాత్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, సుగాసి బాల సుబ్రమణ్యం.. మిథున్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయ కక్ష…
కొందరి పోలీసుల ప్రవర్తన పవిత్రమైన, బాధ్యతకలిగిన వృత్తికి మాయని మచ్చగా మారుతోంది. బాధితుకు న్యాయం చేకూరాల్సిందిపోయి.. అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. ముదిగుబ్బ మండలంలోని పట్నం స్టేషన్ ఎస్సై రాజశేఖర్ ఓ మహిళను లైంగికంగా వేధించాడు. తన కోరిక తీరిస్తే కేసులో న్యాయం చేస్తానని, లేకపోతే ఇబ్బందులు తప్పవని ఓ గిరిజన మహిళను బెదిరించాడు. గరుగుతండాకు చెందిన ఓ మహిళ తమ బంధువులతో కలిసి విడాకుల కేసు విషయంపై రెండు నెలల కిందట పోలీసులను ఆశ్రయించింది. Also Read:Team india…
ఎంపీ అరెస్ట్ పై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. కడప జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని కూటమి నాయకులు అపహాస్యం చేశారు.. ప్రజాస్వామికంగా ఎన్నికలు జరగాలి.. కానీ, పోలీసులను అడ్డం పెట్టుకొని పోలింగ్ జరపడం దారుణం అన్నారు.. ప్రజలు పోలీసుల కాళ్లు పట్టుకుని మా ఓటు మేము వేసుకుంటాం అని ప్రాధేయపడుతున్నారు.. ఇలాంటి ఎన్నికలు దేశ చరిత్రలో ఎప్పుడు చూడలేదు.. చంద్రబాబుకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు అని వార్నింగ్ ఇచ్చారు
ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల చేశారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. 6,100 పోస్టులకు సంబంధించి ఫలితాలు విడుదల కాగా.. ఫలితాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో పెట్టినట్టు తెలిపింది ఏపీ ప్రభుత్వం..
ఒక్క విషయం గుర్తుంచుకొండి.. కొందరు పోలీసు అధికారులకు చెబుతున్నాను.. చంద్రబాబు ఎల్లకాలం ఉండడు.. ఇప్పటికే ఏడాది గడిచింది.. నాలుగేళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది... అప్పుడు మీకు సినిమా చూపిస్తాను.. మా ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కడికి సినిమా చూస్తా అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..
రేపు పల్నాడు జిల్లాలో పర్యటనకు సిద్ధమయ్యారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు వెళ్లనున్నారు జగన్.. ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల చేరుకుంటారు.. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల ఉపసర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శిస్తారు.. అనంతరం మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.. అయితే, పల్నాడు జిల్లాలో జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు.. పోలీసుల…
నిన్న ఆత్మహత్య చేసుకున్న వైఎస్సార్సీపీ నాయకుడు నారాయణరెడ్డి కుటుంబాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఫోన్ నుంచి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నారాయణరెడ్డి ఆత్మహత్యకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన నారాయణరెడ్డిపై అక్రమంగా గంజాయి కేసు పెట్టి జైలుకు పంపడంతో పరువు పోయిందని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.