ఏపీ వైసీపీ నేత కొడాలి నాని లేటెస్ట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ఆయన ఛాతికి బెల్ట్ ధరించి ఉన్నారు. హార్ట్ సర్జరీ తర్వాత నాని బయట ఎక్కడ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నానికి సంబంధించిన ఈ ఫొటో బయటకు రావడంతో వైరల్ అవుతోంది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నానికి ఇటీవల ముంబైలో హార్ట్ ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2న ఆయనకు ఆపరేషన్ జరిగింది.
ప్రకాశం జిల్లా కొండేపిలో ఎస్సై రమేష్ బాబుపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి.. దళితుల పట్ల జగన్ మొసలి కన్నీరు కార్చుతున్నారు. గంజాయి బ్యాచ్ పై పోలీసులు చర్యలు తీసుకోవడం తప్పా జగన్ ? అని నిలదీశారు.
పుష్ప సినిమా టాలీవుడ్‌నే కాదు.. పాన్ ఇండియా లేవల్లో ఓ ఊపు ఊపింది.. అయితే, ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు దర్శకుడు ఉపయోగించిన ట్రిక్కులను.. చాలా సందర్భాల్లో దొంగలు ఉపయోగించిన ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా, కాకినాడ జిల్లా జగ్గంపేటలో పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను జగ్గంపేట, కిర్లంపూడి పోలీసులు టోల్‌గేట్ వద్ద అదుపులోనికి తీసుకున్నారు.
పోలీసు వేధింపులకు దేశంలోనే నిలువుటద్దంలా ఏపీ నిలుస్తుందని.. కస్టోడియల్ టార్చర్ కి ఏపీ పోలీస్ స్టేషన్ లు వేదికలుగా మారిపోతున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.. గతంలో సోనియాతో కలసి జగన్ ను 16 నెలలు జైలులో ఉంచేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు.. లిక్కర్ కేసులో బెయిలుపై బయట తిరుగుతున్న చంద్రబాబు.. లేని లిక్కర్ కేసు సృష్టించారని విమర్శించారు.
బెజవాడలో బంగ్లాదేశ్ కు చెందిన యువకుల కదలికలు కలకలం రేపుతున్నాయి. విజయవాడ నగరంతో పాటు తాడిగడప పెనమలూరు పోరంకి ప్రాంతాల్లో సుమారు 15 మంది బంగ్లాదేశ్ లోని మయన్మార్కు చెందిన యువకులు ఉన్నట్టు విజయవాడలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం అందింది. 15 మంది యువకుల్లో 8 మంది ఈ ఏడాది జనవరిలో నగరానికి వచ్చినట్టు ఏడుగురు నిన్న రాత్రి వచ్చినట్టు గుర్తించారు. Also Read:Tamannaah: మైసూర్ శాండల్ బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ సంఘాలు తీవ్ర…
కొంతమంది పోలీస్ అధికారులు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు.. వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు.. నిబంధనలు అతిక్రమించిన పోలీసు అధికారులను ఎవర్ని వదలం.. కచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..
ప్రకాశం జిల్లాలో దారుణ హత్యకు గురైన టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి కేసును ఛేదించారు పోలీసులు.. ఈ హత్య కేసులో 11 మంది నిందితులను గుర్తించారు.. అయితే, తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ కేసులో పరారీలో మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరయ్య స్వగ్రామం నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలుకి చెందిన ఆళ్ల సాంబయ్య ప్రధాన కుట్రదారుడిగా గుర్తించారు..
ఎవ్వరినీ వదలం.. ఎక్కడున్నా.. కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకోండి అని సూచించారు వైఎస్ జగన్.. ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడున్నా, రిటైర్ అయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం.. అది మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చారు..
మాజీ మంత్రి విడదల రజిని మరిది అరెస్ట్ అయ్యారు.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విడదల గోపినాథ్ అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇచ్చి ఏపీకి తీసుకెళ్లారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు తీసుకున్న ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ.. తాజాగా అరెస్ట్ చేసింది.
కొత్తగా పది పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి.. జిల్లాకు ఒక సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం అన్నారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. గుంటూరు రేంజ్ పరిధిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు హోంమంత్రి.. గుంటూరు, రాజధాని అమరావతి, హైకోర్టు, పొలిటికల్ పార్టీల ఆఫీసులు ఈ ప్రాంతంలో ఉన్నాయని.. పల్నాడులో ఫ్యాక్షన్ కొన్నిచోట్ల ఉంది..