Chebrolu Kiran : ఐటీడీపీ నేత చేబ్రోలు కిరణ్ కి 14 రోజుల రిమాండ్
- రిమాండ్ విధించిన మంగళగిరి కోర్టు
- కిరణ్ పై 111 సెక్షన్ పెట్టడంపై న్యాయమూర్తి అభ్యంతరం
- మంగళగిరి రూరల్ సీఐపై న్యాయమూర్తి ఆగ్రహం
- ఇష్టానుసారంగా సెక్షన్లు పెట్టి చట్టాన్ని అవహేళన చేస్తున్నారని ఆగ్రహం
- మంగళగిరి సీఐ ఛార్జ్ మోమో ఇవ్వాలని ఎస్పీకి ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐటీడీపీ నేత చేబ్రోలు కిరణ్ కి మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మాజీ సీఎం జగన్ సతీమణి భారతిని దూషించిన కేసులో కిరణ్ కు రిమాండ్ విధించారు. కిరణ్ పై 111 సెక్షన్ పెట్టడంతో మంగళగిరి రూరల్ సీఐపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. మీ ఇష్టానుసారంగా సెక్షన్లు పెట్టి చట్టాన్ని అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరి సీఐ శ్రీనివాసరావుకు ఛార్జ్ మోమో ఇవ్వాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఎస్పీని ఆదేశించారు.
READ MORE: CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
కాగా.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సతీమణి వై.ఎస్.భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌కుమార్‌ను గుంటూరు జిల్లా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో వై.ఎస్.భారతిని ఉద్దేశించి అతను చేసిన అసభ్య వ్యాఖ్యలను టీడీపీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. కిరణ్‌కుమార్‌ను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆ వెంటనే మంగళగిరి రూరల్ పోలీసుస్టేషన్‌లో కిరణ్‌పై బెయిల్‌కు వీల్లేని కఠిన సెక్షన్ల కింద కేసు నమోదైంది. రంగంలోకిదిగిన పోలీసులు సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ-ఇబ్రహీంపట్నం మధ్యలో కిరణ్‌కుమార్ ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
READ MORE: CSK vs KKR: చెన్నై తలరాతను ధోని మార్చగలడా? టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్
అక్కడి నుంచి గుంటూరు తరలించారు. శుక్రవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తే ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించేది లేదని, కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు పంపింది. నిందితుడు కిరణ్‌కుమార్‌పై మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం (బీఎన్‌ఎస్ 79), వర్గాల మధ్య శతృత్వాన్ని ప్రేరేపించడం (బీఎన్‌ఎస్ 196(1)), అనుచిత వ్యాఖ్యలు (బీఎన్‌ఎస్ 353(1)), నేరపూరిత కుట్ర (బీఎన్‌ఎస్ 61 (2)), వ్యవస్థీకృత నేరం (బీఎన్‌ఎస్ 111(1)), ఐటీ చట్టంలోని సెక్షన్ 67 (ఏ) వంటి బెయిల్‌కు వీల్లేని సెక్షన్ల కింద కేసు పెట్టి అరెస్టు చేసింది. అరెస్ట్‌కు ముందు తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తంచేస్తూ కిరణ్‌కుమార్ ఒక వీడియో విడుదల చేశారు. ‘వైఎస్ భారతిగారు నన్ను క్షమించండి. మహిళలు అంటే నాకు గౌరవం ఉంది. నేను ఇంటర్వ్యూలో అసభ్యకరంగా మాట్లాడినందుకు మీ కాళ్లు పట్టుకుంటూ క్షమాపణలు కోరుతున్నా’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!