High Court Serious on AP Police: ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్ అయ్యింది. రాష్ట్ర పోలీసు శాఖను మూసివేయడం మేలని సంచలన వ్యాఖ్యలు చేసింది. డీజీపీ, పోలీసు శాఖ నిద్రపోతుందని.. అసలు పోలీసు వ్యవస్ధ పనిచేసేది ఇలాగేనా అంటూ ఆక్షేపించింది. తిరుపతి పరకామణి కేసు విచారణలో పోలీసు శాఖ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రికార్డులు సీజ్ చేయాలని సెప్టెంబర్ 19న ఉత్తర్వులు ఇచ్చినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. సీఐడీలో ఐజీ పోస్టు లేదనే…
ఈ నెల 13న పోలింగ్ రోజు ఏపీలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపుపై ఏపీ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతి జిల్లాకూ ప్రత్యేక పోలీస్ అధికారుల నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జరీ చేశారు. ఏపీ డీజీపీ హరీష్ ఉత్తర్వుల ప్రకారం.. 56 మంది ప్రత్యేక పోలీసు అధికారులను నియమించారు.
AP Police Department: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పోలీసు శాఖలో భారీ ప్రక్షాళన జరగబోతోంది.. మూడేళ్లకు మించి ఒకే చోట పని చేసినవారికి స్థాన చలనం తప్పదు.. ఈ మేరకు యూనిట్ ఆఫీసర్లకు మెమో జారీ చేశారు ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి.. అయితే, చాలా చోట్ల కొందరు పోలీసులు ఐదేళ్లకు మించి ఒకే చోట పని చేస్తున్నట్టు డీజీపీ కార్యాలయం గుర్తించింది… దీంతో, మూడేళ్లకు మించి ఒకే చోట పని చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది..…
మా అయ్యన్నపాత్రుడు వాస్తవాలు మాట్లాడితేనే కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి వస్తున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. వైసీపీ నేతలు చెప్పే అబద్ధాలు.. మాట్లాడే బూతులకి డైరెక్ట్ గా ఉరి వేయాలంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. అంతేకాకుండా ఉచ్ఛ నీచాలు మరచి వైసీపీ నేతలు మాట్లాడుతున్న బూతులు పోలీసులకు వినసొంపుగా ఉంటున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ నేతల తీవ్ర వ్యాఖ్యలపై కేసులు పెడితే పోలీసులు కనీసం స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. జిల్లాలు…