ఏపీలో పీసీసీ చీఫ్ మార్పుపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కిల్లి కృపారాణి కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ మార్పుపై అపోహలు వద్దన్నారు. షర్మిల గురించి అధిష్టానానికి ఎటువంటి ఫిర్యాదు చేయలేదున్నారు. అయినా షర్మిల వర్కింగ్ స్టైల్ ఆమెదని చెప్పుకొచ్చారు.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రచారంలో ఏపీ, మహారాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. భట్టి విక్రమార్క ప్రచారంలో ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ పాల్గొన్నారు.
ఏపీ పీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధంగా సభ్యత్వ నమోదు చేయడం ద్వారా ఏడాదిలో పార్టీ సంస్థాగతంగా బలపడతుందని ఆయన అన్నారు. ప్రతి కార్యకర్త గురుతర బాధ్యతతో ఇంటి వద్దనే సభ్యత్వ నమోదు జరిగేలా జిల్లా పార్టీ అధ్యక్షులు చొరవ చూపాలన్నారు. కమిటీల ఏర్పాటుతో పాటు మండల స్థాయి నుంచి నమోదుకు పార్టీలో గుర్తింపు ఇవ్వాలన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్ముకొనేవాడు…