AP High Court: మూడు పిటిషన్లపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌తో పాటు మరో రెండు పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ నెల 18లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని న్యాయస్థానం ఆదేశించింది. ఇదిలా ఉండగా.. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సమయం కావాలని సీఐడీ కోర్టును కోరింది. కౌంటర్ దాఖలుకు సమయమిచ్చిన కోర్టు.. విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌ను ఈ నెల 18 వరకు విచారించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు పిటిషన్‌పై విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది. చంద్రబాబు తరఫున హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది. సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు తరఫున పిటిషన్ దాఖలు చేయగా.. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది.
Also Read
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
Also Read: Chandrababu Case: ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా
క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఏమందంటే?
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను ఉన్నత న్యాయస్థానం వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఇరువైపుల వాదనలు వినాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు రిమాండ్ రాజ్యాంగ విరుద్ధమని, చంద్రబాబు అరెస్టుకు ముందు గవర్నర్ అనుమతి తీసుకోలేదని, రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను న్యాయమూర్తి ప్రశ్నించారు. గతంలో తాను పీపీగా పనిచేశానని, అభ్యంతరాలు ఉంటే చెప్పాలన్న జడ్జి.. అభ్యంతరాలు ఉంటే వేరే బెంచ్‌కు మారుస్తామని పేర్కొన్నారు. తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్న చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. సోమవారం వరకు కస్టడీపై నిర్ణయం తీసుకోవద్దని ఏసీబీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. అంటే అప్పటి వరకు కస్టడీ పిటిషన్‌పై విచారణ చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18న కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది.
తాజావార్తలు
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!