Adimulapu Suresh: చంద్రబాబు అరెస్టు, రిమాండ్ విషయంలో రాజకీయ కోణం లేదని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. ప్రజాసేవలో ఉన్నవాళ్లు పాలిటిక్స్ అంటే పీపుల్స్ మేనేజ్మెంట్ కాదు.. సర్వింగ్ టూ పీపుల్ అనే కాన్సెప్ట్ వంట బట్టించుకుంటే బాగుండేది.. ఆ పాయింట్ మిస్ అయ్యారన్నారు. ఆయన బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీం కోర్టుకు వెళ్ళటం కాదు.. తప్పు జరిగిందా లేదా అనేదే ముఖ్యమన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మేనిఫెస్టోలో ఉన్న ప్రధాన అంశాన్ని ముడుపులు తీసుకోవటానికి వాడుకున్నారని స్పష్టమైందన్నారు.
Also Read: Chandrababu Naidu Arrest Live Updates : సీసీ కెమెరాల నిఘాలో సెంట్రల్ జైలు
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అంశం చాలా చిన్నదని.. ఇప్పుడు చూసింది గోరంత.. చూడాల్సింది కొండంత అని పేర్కొ్న్నారు. అమరావతి, టిడ్కో హౌస్ స్కాం లాంటివి చాలా ఉన్నాయన్నారు. చంద్రబాబు అయినా, లోకేష్ అయినా అవినీతికి పాల్పడితే వదిలేదే లేదన్నారు. ప్రతీ స్కాం వెలికి తీస్తామన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుందన్నారు. బందులతో నానా యాగీ చేయటం అనేది టీడీపీ కేడర్ కూడా నమ్మలేని పరిస్థితిలో ఉండటం వల్ల సరిగ్గా జరగటం లేదన్నారు.