Seediri Appalaraju: చంద్రబాబు లాయర్ హైకోర్టులో మెమో ఫైల్ చేశారని.. గుండె పరిమాణం పెరిగిందని చెబుతున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుతున్నామన్నారు. వాదనలలో తాను నిప్పు అంటూ స్క్వాష్ పిటిషన్ వేశారన్నారు. మానవతా దృక్పదంతోనే, ఆరోగ్య కారణాలతోనే బెయిల్ వచ్చిందన్నారు. నిజం గెలవాలని తిరిగినా ఆవిడ ఎక్కడుందంటూ మంత్రి ఎద్దేవా చేశారు. నిజం గెలిస్తే.. చంద్రబాబుకి జీవిత కాలం జైలు శిక్ష పడుతుందన్నారు. బెయిల్ వచ్చిన వెంటనే ఓదార్పు యాత్రను ఆపేశారని… ఇదేం అన్యాయమన్నారు. చంద్ర బాబు జబ్బుల రిపోర్ట్‌లు డాక్టర్‌గా పరిశీలించానన్న మంత్రి.. రిపోర్టులలో వ్యాధులు సీరియస్‌గా ఉన్నాయని రాశారన్నారు. హై రిస్క్ కేసును ఏఐజీ హాస్పిటల్ నుంచి ఎలా డిశ్చార్జ్ చేశారని, కంటి ఆపరేషన్‌కు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు రిపోర్టులను ఏ డాక్టరుకు చూపించినా.. కంటి ఆపరేషన్ ఎలా చేస్తారని ప్రశ్నిస్తారన్నారు.
Also Read: Indrakeeladri: ఇంద్రకీలాద్రి ఈవో కె.ఎస్.రామారావుకు అదనపు బాధ్యతలు
కాల్షియం స్కోర్ 900 నుండి 1600 లకు పెరిగితే ఎందుకు యాంజియోగ్రామ్ చేయలేదన్నారు. బైపాస్ సర్జరీ వెంటనే చేయాలి కదా అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. బెయిల్ పొడిగించడానికి కట్టుకథలు అల్లుతున్నారన్నారు. తన లాయర్ల ద్వారా హాస్పిటల్‌లో స్టోరీలు రాయించి కోర్టుకు ఇస్తున్నారన్నారు. రిపోర్ట్‌లో ఎక్కడా ఆయన జబ్బుల కోసం వాడే మెడిసిన్ వాడినట్లు రాయలేదన్నారు. కోర్టులను తప్పుదోవ పట్టించి బెయిల్‌ని పొడిగించడానికే ఈ రిపోర్ట్ అంటూ ఆయన ఆరోపించారు. టీడీపీ ఆఫీస్‌లోనే హాస్పిటల్ రిపోర్ట్ తయారు చేసుకున్నారని ఆరోపణలు చేశారు. ఓ పక్క నిప్పుని అంటూ వీధుల్లో తిరగడానికి బెయిల్ అడగొద్దన్నారు.
Also Read: Andhrapradesh: ఏపీలో జరుగుతోన్న బీసీ కులగణనపై అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
రిపోర్టుల ప్రకారం చంద్రబాబుకు వెంటనే చికిత్సను అందించాలన్నారు. హాస్పిటల్ రిపోర్టుని గౌరవ కోర్టు వారు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. జైలుకు వెళ్లిన నాటి నుంచి ముసలోడిని జైల్లో పెడతారా అంటూ టీడీపీ నేతలు మాట్లాడారన్నారు. చంద్రబాబుకి లేని రోగం లేదని ఇప్పుడు మరలా పార్టీ, ఇంటి వారే ప్రకటిస్తున్నారన్నారు. చంద్రబాబు పరువు ఇంటి వారే తీస్తున్నారని మంత్రి అన్నారు. చంద్రబాబు రాజకీయాలకు పనికిరాడని చెప్పే ప్రయత్నం కుటుంబసభ్యులే చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. సామాన్యులు చంద్రబాబు రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని కోరుతున్నారని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు.