పీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కూడా శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా, కీలక నేతలు తమ పట్టును నిలబెట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులోభాగంగా, ఇతర పార్టీల్లో చేరేందుకు అమితాసక్తి చూపుతున్నారు.
Andhra woman Arrest: డబ్బులు చెల్లించకుండా 15 రోజులగా ఢిల్లీలోని ఓ హోటల్లో బస చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ మహిళను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని ఏరో సిటీలోని ఓ విలాసవంతమైన హోటల్లో గత 15 రోజులుగా ఎలాంటి డబ్బులు చెల్లించకుండా 37 ఏళ్ల మహిళ ఉంటోందని, ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు.
కాపు ఉద్యమ నేత ఏ పార్టీలో చేరతారనే విషయంపై కొంచెం స్పష్టత వచ్చినట్లుగా అనిపిస్తోంది. వైసీపీలోకి వచ్చే ప్రసక్తే లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను కలవడానికి ముద్రగడ పద్మనాభం ఇష్టపడలేదని తెలుస్తోంది. తోట త్రిమూర్తులను రావొద్దని, వచ్చినా కలవనని పద్మనాభం చెప్పినట్లు సమాచారం.
దేశంలో అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడో చోట గ్యాంగ్ రేప్ లు, చిన్నపిల్లలపై అత్యాచారాలు పెట్రేగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. కామాంధులు ఆగడం లేదు. అతి దారుణంగా ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ లో అత్యాచార ఘటన చోటు చేసుకుంది.
సంక్రాంతి పండుగకు సొంత ప్రాంతాలకు వెళ్లేవారికి ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఈ సంక్రాంతికి ఆర్టీసీ అధికారులు అదనపు ఛార్జీల్లేకుండా ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఆర్టీసీ వసూలు చేయనుంది.
కొత్త సంవత్సరం నేపథ్యంలో ఏపీలో పెన్షన్ రూ.3వేలకు పెంచింది సర్కారు. విశ్వసనీయతకు అర్థం చెబుతూ, మానవత్వానికి ప్రతిరూపంగా, పెన్షన్లను క్రమంగా రూ.3వేలకు పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని సంపూర్ణంగా నెరవేర్చారు ముఖ్యమంత్రి వైయస్ జగన్. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఇకపై ప్రతినెలా రూ. 3వేల పెన్షన్ ఇవ్వనున్నారు.
ఓ ఆటో డ్రైవర్ నిజాయితీని చాటుకున్నాడు. తన ఆటో ఓ మహిళా మరిచిపోయిన ఎనిమిది లక్షల విలువైన ఆభరణాలను బ్యాగ్‌ను తిరిగి అప్పగించి ప్రశంసలు అందుకున్నాడు. వివరాలు.. బెజవాడకు చెందిన ఈ ఆటో డ్రైవర్ పేరు పొలవరపు నాగేశ్వరరావు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం విజయవాడలోని తన బంధువుల పెళ్లికి వెళ్తున్న నవీన అనే వివాహిత నాగేశ్వరావు ఆటో ఎక్కింది. ఆమె చేతిలో నెలల చిన్నారి కూడా ఉంది. ఆటో ఎక్కిన అనంతరం…
ఏపీలో దారుణం జరిగింది. ఒంటరి వృద్ధురాలిపై మద్యం మత్తులో లైంగిక దాడికి పాల్పడ్డారు ముగ్గురు అగంతకులు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో మార్కాపురంలో మండలంలో శనివారం చోటుచేసుకుంది. ప్రస్తుతం బాధితురాలు విషమ పరిస్థితిలో ఆస్పత్రి చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read: PM Modi: ప్రధాని మోడీ అయోధ్య పర్యటన.. రూ. 1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం వివరాలు.. మార్కాపురం మండలం వడ్డెర కాలనీలో…
గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది 18 శాతం నేరాలు తగ్గాయని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ అన్నారు. శుక్రవారం వార్షిక క్రైం రేట్ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది నమోదైన చోరీ కేసుల్లో సగానికి పైగా కేసులు చేధించామన్నారు. చోరీ కేసులను అధికంగా రికవరీ చేశామని, 949 చోరీ కేసులు నమోదు కాగా 452 కేసులు చేధించామన్నారు. Also Read: Historic Peace Deal: కేంద్రం, ఉల్ఫా మధ్య చారిత్రాత్మక శాంతి…