Andhra Pradesh: జూన్ 4వ తేదీన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అనంతరం ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ క్రమంలోనే జూన్ 3వ తేదీన మంత్రుల పేషీలు, ఛాంబర్లను సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) హ్యాండోవర్ చేసుకోనుంది. సచివాలయంలో తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు, వస్తువులు బయటకు తీసుకెళ్లొద్దంటూ జీఏడీ ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేకించి మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖల్లోని ఫైళ్లు, స్టేషనరీని తరలించేందుకు వీల్లేదని జీఏడీ స్పష్టం చేసింది. వాహన తనిఖీలు నిర్వహించాల్సిందిగా సచివాలయం భద్రత చూసే ఎస్పీఎఫ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. జూన్ 3వ తేదీలోగా పేషీలు, ఫర్నిచర్ అప్పగింత ప్రక్రియను పూర్తి చేయాలని జీఏడీ ఆదేశించింది. నాలుగో తేదీన కౌంటింగ్ జరగనుండడంతో పేషీల స్వాధీన ప్రక్రియను జీఏడీ ప్రారంభించింది.
Read Also: Andhra Pradesh : ఏపీ సీఈవో జారీ చేసిన మెమోను వెనక్కి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం