నేడు తాడేపల్లిలో వైఎస్ జగన్ కీలక ప్రెస్‌మీట్.. ఉదయం 11 గంటలకు రైతు సమస్యలు, అక్రమ అరెస్టులు, పర్యటనలపై ఆంక్షలు వంటి వాటిపై జగన్ మాట్లాడే అవకాశం
ఈరోజు సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక ప్రక్రియ.. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఉప ఎన్నిక ప్రక్రియ.. ఎన్నికలు బహిష్కరించే ఆలోచనలో వైసీపీ ఎంపీటీసీలు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడులో పర్యటించనున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్ది.. 5 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చెయ్యనున్న మంత్రి
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి పాల్గొనున్న మంత్రి నారాయణ
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పర్యటన.. చిలమత్తూరు మండలం కోడూరు పంచాయతీ నల్లరాళ్లపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి
నేడు ఏలూరులో మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారధి పర్యటన.. ఎమ్మెల్యే లు, ప్రజాప్రతినిధులతో కలిసి పీ4 కార్యక్రమంపై అధికారులతో సమీక్ష
నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం.. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరగనున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం.. మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర జల శక్తి కార్యాలయంలో జరగనున్న సమావేశం
నేడు కాకినాడ కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశంలో పాల్గొనున్న మంత్రి నారాయణ.. నియోజకవర్గాలలో అభివృద్ధిపై ఎమ్మెల్యేలతో రివ్యూ
నేడు సంగారెడ్డి జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ పర్యటన.. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొననున్న మంత్రి వివేక్
కొమురం భీం జిల్లాలో రెండవ రోజు కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా పర్యటన.. పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న కేంద్ర మంత్రి
నేడు పెద్దపల్లిలో పర్యటించనున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, శ్రీధర్ బాబు.. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొననున్న మంత్రులు
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. ఉదయం 10 గంటలకు కేబినెట్ మీటింగ్.. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశం