అనంతపురం కలెక్టరేట్లో వెపన్ మిస్ ఫైర్ ఘటన కలకలం సృష్టించింది. తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో కలెక్టరేట్లో గార్డు డ్యూటీలో ఉన్న (1996 బ్యాచ్ AR HC 2242) సుబ్బరాజు 303 వెపన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయింది. ఛాతీలో నుంచి బుల్లెట్ బయటకు వెళ్లిపోయింది. త్రీవంగా గాయపడిన సుబ్బరాజును అక్కడే ఉన్న గార్డు సిబ్బంది చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పుత్రికి తరలించారు. Also Read: Ind vs NZ: టాస్ గెలిచి బ్యాటింగ్…
శ్రీకాకుళం జిల్లాలో సీఎం పర్యటన: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ రోజు సీఎం దీపం పథకం 2.0 గురించి చెప్పారు. దీపావళి కానుకగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇచ్ఛాపురం నియోజకవర్గం, ఈదుపురంలో దీపం 2.0 ఉచిత సిలిండర్ల…
ఆగని ఇసుక మాఫియా ఆగడాలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా.. ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఇసుక అక్రమాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఇసుక అక్రమ తవ్వకాలకు పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు కేంద్రంగా మారింది. అనిగండ్లపాడు రీచ్ వద్ద ఇసుక మాఫీయా హల్చల్ చేసింది. గ్రామ సరిహద్దు వద్ద ర్యాంపు నుంచి ఇసుకను తెలంగాణకు తరలిస్తున్నాయి. అన్నిండ్లపాడు గ్రామ సరిహద్దు వద్ద ర్యాంపులో…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా.. ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఇసుక అక్రమాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఇసుక అక్రమ తవ్వకాలకు పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు కేంద్రంగా మారింది. అనిగండ్లపాడు రీచ్ వద్ద ఇసుక మాఫీయా హల్చల్ చేసింది. గ్రామ సరిహద్దు వద్ద ర్యాంపు నుంచి ఇసుకను తెలంగాణకు తరలిస్తున్నాయి. అన్నిండ్లపాడు గ్రామ సరిహద్దు వద్ద ర్యాంపులో ఇసుక తీసుకెళ్తున్న లారీలను రైతులు…
బైక్పై టపాసులు తీసుకెళ్తుండగా పేలుడు: దీపావళి పండుగ రోజున ఏలూరు నగరంలో విషాదం చోటు చేసుకుంది. టపాసులను బైక్పై తీసుకెళ్తుండగా ఒక్కసారి పేలిపోయాయి. బండి గోతిలో పడి టపాసులు రాపిడికి గురై పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ పేలుడు దాటికి వాటిని తరలిస్తున్న వ్యక్తి శరీరం ముక్కలు ముక్కలుగా ఎగిరిపడింది. పేలుడు దాటికి యాక్టివా బండి పూర్తిగా దగ్ధమైంది. సమీపంలో ఉన్న నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు దాటికి ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది.…
మద్యం షాపుల్లో ఎవరైనా ఎంఆర్పీ ధరలకు మించి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా ఉపేక్షించవద్దని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అమరావతిలో మద్యం ధరలు, ఇసుక లభ్యత, సరఫరాపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
కడప ఎయిర్పోర్టులో కడప - హైదరాబాద్ ఇండిగో కనెక్టింగ్ విమాన సర్వీసును రాష్ట్ర రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పుట్టా సుధాకర్ యాదవ్, చైతన్య రెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఏడాదిగా కడప-హైదారాబాద్ విమాన సర్వీసులు లేవని.. ఎన్నో సార్లు లేఖలు రాసినా ప్రయోజనం లేదన్నారు.
ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ వద్దని.. ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేయాలని.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీతోపాటు 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వచ్చాయన్నారు. వాటిని సక్రమంగా, పారదర్శకంగా సద్వినియోగం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు.
టీడీపీకి కంచుకోటగా శ్రీకాకుళం జిల్లా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎయిర్పోర్టు పూర్తి చేయాలనుకుంటున్నామన్నారు. మూలపేట పోర్టు పూర్తి చేసి సంవత్సర కాలంలో షిప్ వచ్చేలా చేస్తామన్నారు.