రాష్ట్రంలో నూతన క్రీడా విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. క్రీడలకు ప్రోత్సాహం, మౌలిక సదుపాయాలు , క్రీడల నిర్వహణ, గ్రామ స్థాయిలో క్రీడా స్థలాల ఏర్పాటు పై చర్చించారు.
పంచ గ్రామాల సమస్యకు టైం బాండ్ పెట్టుకొని పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ భూముల గుర్తింపు, కేటాయింపు ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. విశాఖ జిల్లా కలెక్టరేట్లో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నగరంలో గుంతల రోడ్లు ఉండటానికి వీలు లేదు.. ఎక్కడైనా ఉంటే అధికారులపై చర్యలు తప్పవన్నారు.
రాష్ట్రం వెంటిలేషన్ మీద ఉందని.. నేడు వెంటిలేటర్ మీద నుంచి ఆక్సిజన్ తీసుకునే పొజిషన్‌కు వచ్చిందన్నారు. ఎన్నికలలో హామీలు ఇచ్చారు, ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నిస్తారు కానీ.. ఈ రాష్ర్టానికి అప్పులు ఉన్నాయని చెబితే వినే పరిస్థితి లేదన్నారు.చంద్రబాబు రాష్ట్రంలో పుట్టడం అదృష్టమన్నారు. క్లిష్ట సమయంలో సీఎంగా చంద్రబాబు ఉన్నారని వెల్లడించారు.
తిరుపతిలో దీపం-2 పథకం కార్యక్రమాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే వారిపై ఛాలెంజ్ విసురుతున్నానని.. వైసీపీ నేతలు దీపం-2 పథకం కార్యక్రమాలకు రావాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉచిత సిలిండర్ ఇస్తున్న విషయాన్ని వైసీపీ నేతలు గమనించాలన్నారు.
విశాఖపట్నం కలెక్టరేట్లో విశాఖ, అనకాపల్లి జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు మూడు రోజుల్లో రాష్ర్ట భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక ఆవిష్కరిస్తామన్నారు. పది పాయింట్లతో కూడిన అభివృద్ధి ప్రణాళికతో 2047 నాటికి అన్నింటా ముందంజలో ఉంటామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్(సీపీసీ) కోసం ఎంపీ పురందేశ్వరి ఆస్ట్రేలియాకు పయనమయ్యారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ( సీపీఏ) ఇండియా రీజియన్ స్టీరింగ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు, మహిళా పార్లమెంటేరియన్, స్టీరింగ్ కమిటీకి ఛైర్పర్సన్ ఎంపీ పురంధేశ్వరి ఆస్ట్రేలియా దేశంలోని సిడ్ని నగరంలో 67వ సీపీసీలో పాల్గొననున్నారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ట్విట్టర్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అబద్దాలు ఆడడంలో అంబటిది అందె వేసిన చెయ్యి అని.. ప్రాజెక్టు ఎత్తు తగ్గించినట్లు ఆధారాలు ఉంటే చూపాలన్నారు. నిద్రపోయే వాణ్ణి లేపవచ్చని.. నిద్ర నటించే వాణ్ణి ఎవరు లేపగలరని అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
పోలవరం ప్రాజెక్ట్ ఏపీ ప్రజలకు జీవనాడిలాంటిదని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
వెన్నెల సంఘటనపై స్పందించిన పవన్: పదోతరగతి విద్యార్థి వెన్నెల తల్లిదండ్రులు మధురపూడి విమానాశ్రయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిశారు. తమ కుమార్తె విషయంను పవన్ దృష్టికి వెన్నెల కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. వెన్నెల ఆత్మహత్యకు పాఠశాల యాజమాన్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ నేడు పవన్ కాన్వాయ్కి అడ్డుపడ్డారు. మధ్యాహ్నం వచ్చి మాట్లాడతానని డిప్యూటీ సీఎం పవన్ వారికి భరోసా ఇచ్చారు. ఇదో ఆచారమట మరి: దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని…
శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటో.. కంచిలి మండలం బారువా సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలు అయ్యాయి. నలుగురు కూలీలకు తీవ్ర గాయాలు కాగా.. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంకు చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఆటో అదుపు తప్పడం వలనే ఈ ప్రమాదం జరిగుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇస్సకోడేరులో…