అమరావతిలో శుక్రవారం రాజధాని నిర్మాణ పనులు పున:ప్రారంభం కాబోతున్నాయి. ప్రధాని మోడీ చేతుల మీదుగా పనులు ప్రారంభం కానున్నాయి. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఇక రాష్ట్రంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపించింది. ఇందులో భాగంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌ను కూడా ఆహ్వానించింది. శుక్రవారం జరిగే ప్రధాని మోడీ సభకు రావాలంటూ తాడేపల్లిలోని జగన్ నివాసానికి ప్రొటోకాల్ అధికారులు వెళ్లారు. అయితే గురువారం జగన్ విశాఖ పర్యటనకు వెళ్లారు. సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. బాధితులను పరామర్శించడానికి వెళ్లారు. మాజీ ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతో పీఏ కే.నాగేశ్వరరెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేసి వెళ్లారు.
ఇది కూడా చదవండి: YS.Jagan: నేడు స్థానిక ప్రతినిధులతో జగన్ భేటీ.. అనంతరం బెంగళూరుకు పయనం
ఇదిలా ఉంటే వైఎస్.జగన్ గురువారం సాయంత్రం గన్నవరం నుంచి బెంగళూరుకు వెళ్తున్నారు. ఈ రాత్రికి బెంగళూరులోని ఆయన నివాసానికి చేరుకోనున్నారు. గురువారం జరిగే స్థానిక ప్రజాప్రతినిధుల సభకు హాజరై.. అనంతరం బెంగళూరు వెళ్లనున్నారు.
ఇది కూడా చదవండి: Guntur: పేరేచర్ల కొండల్లో వ్యక్తి దారుణ హత్య.. వీడియో వైరల్‌తో వెలుగులోకి ఘటన