విపక్షాలపై వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో విపక్షాలు సిద్ధాంతాలను పక్కన పెట్టి ఏకమై రాజకీయాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. అంతేకాకుండా సీఎం జగన్‌కు ప్రజలు అండగా నిలబడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలు నీరాజనం పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఓటీఎస్ వరంలాంటిదని ఆయన అభివర్ణించారు. ఏకకాలంలో ఇంటిపై పూర్తి హక్కును పొందేలా జగన్ తీసుకువచ్చిన ఓటీఎస్‌పై ప్రజల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ కు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ఏంచేయలేరని ఆయన ఉద్ఘాటించారు.