ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద హత్యకేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి వివేకా హత్య కేసుతో నాకు సంబంధం లేదంటూ అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పను ఆశ్రయించాడు. రూ.10 కోట్లు సుపారీ తీసుకొని అవినాష్రెడ్డి, శంకర్రెడ్డిలు నాతో వివేకా హత్య చేయినట్లు చెప్పాలంటూ వివేకా కుమార్తె సునీత, సీబీఐ, మడకశిర ఎస్సై, సీఐ శ్రీరామ్ లు నన్ను వేధిస్తున్నారని గంగాధర్ రెడ్డి ఎస్పీకి వెల్లడించారు. అంతేకాకుండా నాకు, నా…
వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాసారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం రూ. 6054 కోట్ల నష్టం వాటిల్లితే.. కేవలం రూ. 35 కోట్ల నిధులను మాత్రమే విడుదల చేయడం సరైవ పద్దతి కాదని, ప్రకృతి వైపరీత్యాల కోసం ఖర్చు పెట్టాల్సిన రూ. 1100 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని కాగ్ తప్పు పట్టిందన్నారు. జాతీయ ప్రకృతి విపత్తుల నిర్వహాణ నిబంధనలకు విరుద్దంగా…
ఏపీని వర్షాలు వదలనంటున్నాయి. మొన్నటి వరకు కురిసిన వర్షాలతోనే ఏపీలో వాగులు, వంకలు నిండి పొంగిపొర్లుతున్నాయి. చెరువులకు గండ్లు పడి గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. అయితే తాజాగా అండమాన్లో అల్పపీడనం ఏర్పడడంతో మరోసారి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షా పడుతోంది. అయితే వెంకటగిరి, కోవూరు నియోజకవర్గంలో రాత్రి నుంచి మోస్తరుగా, సూళ్లూరుపేట, సర్వేపల్లి నియోజకవర్గాలలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి.…
తెలంగాణలో అంపశయ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని అధిష్టానం ప్రకటించి ఊపిరి పోసిందని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించిన నాటి నుంచి విముఖతతో ఉన్న సీనియర్ నేతల్లో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఒకరు. అయితే ఆనాటి నుంచి మొన్నటి హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల వరకు రేవంత్రెడ్డిపై కోమటిరెడ్డి వ్యతిరేకంగానే వ్యాఖ్యలు చేశారు. Also Read : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. వ్యవసాయంపై కమిటీ..…
ఏపీ రాజకీయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రతిపక్ష లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్లేనని అన్నారు. అంతేకాకుండా కేంద్రం షరతులకు అనుగుణంగా పన్నులు పెంచి అప్పులు తీసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులపై నియంత్రణ లోపించిందని, అప్పులు తగ్గించి ఆదాయం పెంచుకోనే మార్గాలను అన్వేషించాలని హితవు పలికారు. రాష్ట్రానికి 6 లక్షల 22 కోట్ల రూపాయలకు…
ఏపీలో మాటల యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. టీడీపీ, వైసీపీ నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయం వేడెక్కింది. అయితే తాజాగా టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస రావు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కొడాలి, వంశీ, అంబటి, ద్వారంపూడి మాటలను వారి ఇంటి ఆడవాళ్లే అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. అంతేకాకుండా వైసీపీ నేతల్లా మేము మాట్లాడగలం.. కానీ మాఇంట్లో ఆడవాళ్లు ఒప్పుకోరంటూ మండిపడ్డారు. చంద్రబాబు భద్రత తీసి వస్తే కొడాలి నాని…
భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం అవుతోంది. ఇప్పటికీ భారీ వర్షాలతో వాగుల, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువు కట్టలు తెగిపోవడంతో కింద ఉన్న గ్రామాలు వరద నీటిలో చిక్కుకుంటున్నాయి. అయితే తాజాగా రాయల్ చెరువు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాయల చెరువుకు ఇప్పటికే గండి పడడంతో అధికార యంత్రాంగం దానిని పూడ్చేపనిలో నిమగ్నమైంది. ఇప్పుడు కింది గ్రామాలు ఉలిక్కిపడేలా రాయల చెరువుకు మరో 3 చోట్ల నుంచి నీరు లీకవుతోంది. Also Read : చెయ్యేరు బీభత్సం.. ఇంకా…
భారీ వర్షాలు ఏపీకి తీరని నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలతో కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోవడంతో చెయ్యేరు నదికి వరద పోటెత్తింది. దీంతో అన్నమయ్య ప్రాజెక్టు కింద ఉన్న 12 గ్రామాలు దెబ్బతిన్నాయి. కొన్ని గ్రామాలైతే ఇక్కడ ఊర్లు ఉండేవి అనేంతా కొట్టుకుపోయాయి. ఇళ్లు, వాకిలి, పశువులు కొట్టుకుపోవడంతో అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ వరద బీభత్సవానికి పలు గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయి. అయితే ఈ వరదల్లో 39 మంది…
చంద్రబాబు నేటి ఉదయం తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే రోజా. తిరుపతిలో మీడియా ముందు చంద్రబాబు మాట్లాడిన విధానం చూస్తుంటే త్వరలోనే చంద్రబాబును పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయించాలని అందరికీ అర్థమవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో భారీ వర్షాల కారణంగా సరిహద్దు ప్రాంతాలను సీఎం జగన్ అప్రమత్తం చేశారని.. అంతేకాకుండా ఆ తరువాత భారీ వర్షాలతో నష్టపోయిన జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు…