PERNI NANI: రాష్ట్ర విభజనకు చంద్రబాబు ఎందుకు శుభాకాంక్షలు చెప్తున్నారు?.. పేర్ని నాని మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PERNI NANI: టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్నినాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇవాళ (శుక్రవారం) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు ఆ రాష్ట్రానికి శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై స్పందించిన పేర్ని నాని.. రాష్ట్ర విభజనకు చంద్రబాబు ఎందుకు శుభాకాంక్షలు చెప్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చెప్పారా అని అడిగారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ నవంబర్ 1న మాత్రమేనని చంద్రబాబుకు పేర్ని గుర్తుచేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేది వైసీపీ స్టాండ్ అని పేర్నినాని తెలిపారు. చంద్రబాబు లాగా పూటకో నిర్ణయం తమది కాదన్నారు. రెండు రాష్ట్రాలు విడగొట్టాలని తానే చెప్పానని చంద్రబాబు చెబుతున్నారని పేర్ని నాని గుర్తు చేశారు.
Read Also:
Also Read
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
- Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
- Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
- Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ పార్క్ శంకుస్థాపన చేసింది నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అని, మరి బాబు చేసిందేటని పేర్ని ప్రశ్నించారు. 2047 కి పేదల్ని కోటీశ్వరులను చేస్తారట, అప్పటికి బాబు వయసు ఎంత ఉంటుందని పేర్ని అడిగారు.విజన్ 2020 పోయి 2047 వచ్చిందని, అధికారంలో ఉన్నప్పుడు ఏది చెయ్యడని చంద్రబాబుపై సెటైర్లు వేశారు పేర్నినాని. చంద్రబాబు సంపద సృష్టించా అని చెప్తాడని, అసలు పొలాలు ఇచ్చిన వాళ్ళకి ఎవరికైనా ప్లాట్లు ఇచ్చాడా అని పేర్ని ప్రశ్నించారు. విజయవాడ గుంటూరు మధ్య రాజధాని చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కట్టచ్చుగా, ఎందుకు కట్టలేదని కూడా అడిగారు. పౌర విమనయాన శాఖా మంత్రి అప్పట్లో నీ జేబులో ఉంటే కనీసం వైజాగ్ ఎయిర్పోర్ట్ పనులు కూడా చెయ్యలేదుగా అని పేర్ని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
Read Also:
చంద్రబాబు భ్రమల్లో బతుకుతుంటాడని పేర్ని నాని ఆరోపించారు. నీ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నప్పుడే గంటా శ్రీనివాసరావు గంజాయి పెరిగి పోయిందని పేర్ని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నిజం మాట్లాడితే తల వెయ్యి చెక్కలయ్యే శాపం ఉన్నట్లు ఉందని విమర్శించారు. అంతేకాకుండా చంద్రబాబు హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా తీసుకుని రాగలిగాడా అని ప్రశ్నించారు. ఒక్క డిగ్రీ కాలేజీ అయినా కట్టాడా అంటూ చంద్రబాబుపై తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించారు పేర్ని నాని.
- Tags
- ap news
- Chandra babu
- Perni Nani
- tdp
- ycp
తాజావార్తలు
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
-
Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
-
Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
-
Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!