Ap News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీ ఏర్పాటుపై కసరత్తులు చేస్తుంది. ఈ ఏడాది జూలై నుంచి కొత్త పీఆర్సీ ఉద్యోగులకు అమల్లోకి రావాల్సి ఉంది. ఇప్పటికే కొత్త పీఆర్సీ కమిటీ కోసం ప్రభుత్వానికి విఙప్తి చేస్తున్నారు సచివాలయం ఉద్యోగుల సంఘం సహా ఇతర ఉద్యోగ సంఘాలు. వారి విఙప్తి నేపథ్యంలో 12 పీఆర్సీ కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం కార్యదర్శి ఆదేశాలు జారీ చేసారు. పీఆర్సీ కమిటీ ఛైర్మన్ గా సమీర్ శర్మతో పాటు మరి కొంత మంది రిటైర్డ్ ఐఏఎస్ ల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తుంది.
Read Also: Big Breaking News: కోరమాండల్ ఎక్స్ ప్రెస్ కు పెనుప్రమాదం
మరోవైపు పీఆర్సీ కసరత్తు ఉద్యోగుల్లో సానుకూల పవనాలు క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత పీఆర్సీ సిఫారసులను అమలు చేయడంలో వచ్చిన విభేదాలు కావొచ్చు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను తిరిగి అమల్లోకి తెస్తానన్న మాటను జగన్ నిలబెట్టుకోలేకపోవడం వల్ల కావొచ్చు. కారణాలు ఏమైనా, ఉద్యోగ వర్గాల జగన్ సర్కారు పట్ల ఒక వ్యతిరేకత ఏర్పడిన మాట నిజం. వారిలోను వ్యతిరేకతను దూరం చేసి, తిరిగి తన పట్ల ప్రసన్నులుగా మార్చుకునే లక్ష్యంతోనే ఇప్పుడు ప్రభుత్వం పీఆర్సీ కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
Read Also: 500Note: భారీగా చెలామణిలో రూ.500ఫేక్ నోట్లు.. వార్తలో నిజమెంత?
కమిషన్ ను ఇప్పుడే ఏర్పాటు చేసేసి.. కొన్ని నెలల తర్వాత.. సరిగ్గా ఎన్నికలకు ముందు వారి నివేదికను తీసుకుని.. కొత్త జీతాల పెంపును ప్రకటించినా చాలు. ఒక్కసారిగా ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతాయి. జగన్ పట్ల ఈ నాలుగేళ్లలో కలిగిన వ్యతిరేక అభిప్రాయాలను వారు చిటికెలో మరచిపోగలరు. ఒకసారి వ్యతిరేకత తొలగిపోయాక.. మిగిలిన సమాజానికి జగన్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు అన్నీ కూడా వారికి పాజిటివ్ దృక్కోణంలోనే కనిపిస్తాయి.
అలా ఎన్నికల వేళకు, కీలకమైన ఉద్యోగ వర్గాల్లో పాజిటివిటీ ఏర్పడుతుందని జగన్ ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. టీడీపీ తన ఇటీవలి మేనిఫెస్టోలో ఉద్యోగుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. జగన్ ఇప్పుడు ఆ వర్గంపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారు.