* కొమరంభీం జిల్లా: కాగజ్ నగర్‌లో నేడు బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ సమావేశం.. హజరు కానున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జీ మురళీధర్ రావు
* వరంగల్ జిల్లా: నేడు నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని పోడు రైతులకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
* కాకినాడ: నేడు కాకినాడ రానున్న ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు.. ఉద్యోగ సంఘాలు సమావేశంలో పాల్గొనున్న బొప్పరాజు
* నేడు ఏపీ ఈ-సెట్ ఫలితాలు.. ఫలితాలు విడుదల చేయనున్న ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి.. గత నెల 20న జరిగిన ఏపీ ఈ-సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్
* అంబేద్కర్ కోనసీమ: నేడు కాజులూరు మండలం దుగ్గుదూరు గ్రామంలో గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
* కాకినాడ: నేడు ప్రత్తిపాడులో పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనున్న నటుడు సుమన్
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు హోంమంత్రి తానేటి వనిత పర్యటన కార్యక్రమాలు.. ఉదయం 10:30 గంటలకు రాజమండ్రి జోస్ అలుక్కస్ ప్రారంభోత్సవం.. కొవ్వూరు పట్టణంలోని వివిధ వార్డులలో నూతనంగా వేయబడిన రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న తానేటి వనిత
* వరంగల్: 8న ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా నేడు వరంగల్ జరిగే సన్నాహక సమావేశంలో పాల్గొననున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నేతలు.. ఉదయం 10 గంటలకు కాజీపేట ఆయోధ్యపురం పీవో హెచ్, వ్యాగన్ తయారీ పరిశ్రమ స్థలాలన్ని పరిశీలించనున్న కిషన్ రెడ్డి.. 10.45కి పాత్రికేయుల సమావేశం
* విశాఖ: నేడు సింహాచలం అప్పన్న స్వామి గిరి ప్రదక్షిణ.. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న యాత్ర.. ప్రచార రథం ప్రారంభించనున్న అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు
* పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెంలో అమ్మఒడి కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ
* విశాఖ: నేడు గంగవరం పోర్టు కార్మికుల ర్యాలీ.. పెద్ద గంట్యాడ గాంధీ విగ్రహం వరకు కుటుంబాలతో కలిసి నిరసన ప్రదర్శన చేయనున్న కార్మికులు.. వేతన ఒప్పందం వ్యవహారంలో ఆదానీ యాజమాన్యం, కార్మికుల మధ్య కుదరని ఒప్పందం.. విధులను బహిష్కరించిన 500 మంది కార్మికులు.. ముందస్తు చర్యగా గంగవరం పోర్టు పరిసరాల్లో పోలీసు భద్రత
* విశాఖ: ఆధార్ కార్డు ఉంటేనే టమోటా.. నేటి నుంచి సబ్సిడీపై అమ్మకాలు ప్రారంభం.. ఒక్కో ఫ్యామిలీకి కేజీ పరిమితి.. 50 రూపాయలకే రైతు బజార్లలో విక్రయం