Jagananna Suraksha Got Huge Response From AP People: జగనన్న సురక్ష కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 1305 గ్రామ, వార్డు సచివాలయాల్లో జగనన్న సురక్ష క్యాంపులు నిర్వహించారు. సేవలు పొందడంలో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు.. ఈ శిబిరాల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకున్నారు. ముఖ్యంగా.. వివిధ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల సమయం కావడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆదాయం, కుల సహా పెద్ద సంఖ్యలో వివిధ సర్టిఫికెట్లను అందుకున్నారు. అర్హులై ఉండి, ఏ ఒక్కరూ లబ్ది అందకుండా మిగిలిపోకూడదన్న ముఖ్య ఉద్దేశంతో.. జగనన్న ప్రభుత్వం చేపట్టిన మరో ప్రతిష్టాత్మక కార్యక్రమమే ఈ జగనన్న సురక్ష. ఈ కార్యక్రమం కింద తొలిరోజు 1305 గ్రామాల్లో ఆయా మండలాలకు చెందిన అధికారులు శిబిరాలు నిర్వహించారు. ప్రభుత్వ సేవలు, ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యంగా… ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు, ప్రజా ప్రతినిధులు, గృహసారధులు ఈ కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొన్నారు.
Times Now Survey: ఏపీలో ఇప్పుడు ఎన్నికలొస్తే.. వైసీపీదే ఘనవిజయం
సరైన ధృవపత్రాలు లేని కారణంగానో లేక ఇతరత్రా కారణాల వల్లనో.. అక్కడక్కడా పథకాలు పొందకుండా మిగిలిపోయిన వారిని జల్లెడపట్టి, వారి వివరాలను సేకరించి, వారికి అవసరమైన పథకాలతో పాటు సేవలు అందించే ఈ కార్యక్రమం తొలిరోజు చురుగ్గా సాగింది. ఈనెల 23న ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన తర్వాత.. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల వ్యవస్థ ప్రతి ఇంటినీ జల్లెడ పట్టారు. అర్హత ఉండి కూడా.. వివిధ కారణాల వల్ల పథకాలు అందని, అలాగే సర్టిఫికెట్లు పొందని వారి వివరాల్ని సేకరించారు. ఈ సర్వీసులన్నింటినీ రిజిస్టర్ చేసిన వారికి టోకెన్లు ఇచ్చారు. ఆయా మండలాలకు చెందిన అధికారులు వీటిని పరిశీలించి.. జగనన్న సురక్ష క్యాంపులకు వెళ్లేముందే పూర్తిస్తాయిలో సన్నద్ధమయ్యారు. జులై 1న రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా ప్రతి మండలానికీ 2 క్యాంపులు చొప్పున జగనన్న సురక్ష క్యాంపులు నిర్వహించారు. అక్కడిక్కడే సర్టిఫికెట్లు జారీచేసేందుకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకున్నారు. దాదాపుగా ఎలాంటి సమస్యలు లేకుండా తొలిరోజు పౌరులకు సేవలు అందించగలిగారు. ఈ కార్యక్రమంలో మొత్తం 22,728 మంది వాలంటీర్లు పాల్గొనగా.. వారు 14,28,481 మంది కుటుంబాలను కవర్ చేశారు.
Extramarital Affair: ప్రియుడి కోసం భార్య స్కెచ్.. మరో మహిళను రంగంలోకి దింపి..
తొలిరోజు క్యాంపుల్లో 4,42,840 సర్వీసులు రిజిస్టర్ కాగా, అక్కడికక్కడే 3,69,373 సర్టిఫికెట్లు జారీచేశారు. ఇందులో.. ఆదాయం, కులం ధృవీరణ పత్రాలే అధిక సంఖ్యలో ఉన్నాయి. అలాగే మరణ, జనన ధృవీకరణ పత్రాలు కూడా చాలామంది పొందారు. చాలా రోజులుగా సరైన ధృవపత్రాలు లేకపోవడం వల్ల ఈ సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు పడ్డామని, జగనన్న సురక్ష క్యాంపులు ద్వారా ఆ సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని జనాలు సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా.. ఈ సర్టఫికెట్లు పొందిన వారు, గతంలో పథకాలు అందకుండా మిగిలిపోయిన వారు అర్హత సాధిస్తారు. అలాగే ఖరీఫ్ సీజన్ కావడంతో చాలామంది కౌలు రైతులు సీసీఆర్సీ కార్డులు పొందడానికి ఈ క్యాంపులు బాగా ఉపయోగపడ్డాయి. మ్యుటేషన్ కోసం చాలామంది తమ సర్వీసులను రిజిస్టర్ చేసుకున్నారు. అవసరాలను బట్టి.. అక్కడక్కడ వైద్యసేవలు కూడా జగనన్న సురక్ష క్యాంపుల్లో నిర్వహించారు. జులై 1 నుంచి నెలరోజులపాటు 15004 గ్రామ, వార్డు సచివాలయాల్లో సురక్ష క్యాంపులను నిర్వహిస్తారు.