శ్రీకాకుళం బందరువానిపేటలో పర్యటించారు మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు. ఈ సందర్భంగా బోటు బోల్తా ఘటనలో మృతిచెందిన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించారు అప్పలరాజు, ధర్మాన. మృతి చెందిన ముగ్గురు మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్ గ్రేషియో ప్రకటించారు. తక్షణ సహాయం కింద ఐదులక్షల చొప్పున చెక్కులు అందించారు. మత్స్యకారులకు జగన్ ఎప్పుడూ అండగా ఉంటారు. మత్స్యకారుల అభివృద్ధికి అన్ని చర్యలూ తీసుకుంటున్నాం అని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఫ్లోటింగ్ జెట్టీల నిర్మాణాలకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం. భావనపాడు పోర్టు విషయంలో త్వరలోనే టెండర్లకు వెళతాం. ఈ భావనపాడు పోర్టు పై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు అని పేర్కొన్నారు.