AP High Court: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష రద్దు విషయంలో ఏపీ ప్రభుత్వం అప్పీల్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది.. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్‌లో సవాలు చేసింది ఏపీపీఎస్సీ.. అయితే, ఈ పిటిషన్‌పై ఈ నెల 21వ తేదీక కీలక ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు.. ఈ రోజు విచారణ జరపాల్సి ఉండగా.. తదుపరి విచారణను వచ్చే నెల 18వ తేదీకి వాయిదా వేసింది.. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కొనసాగుతారని గతంలోనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే.
Read Also: Allu Arjun : రామ్ చరణ్ కు బర్త్ డే విషెస్ చెప్తూ అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..
ఇక, ఈ నెల 21వ తేదీన గ్రూప్ 1 పరీక్ష రద్దుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధిస్తూ.. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు యథావిధిగా కొనసాగుతారని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.. ఇదే సమయంలో ఏపీపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణ 27వ తేదీకి అంటే ఈ రోజుకి వాయిదా వేయగా.. ఈ రోజు విచారణను మరోసారి వచ్చే నెల 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది.. కాగా, 2018 గ్రూప్-1 కింద 167 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చింది ఏపీపీఎస్సీ. అయితే, ఎంపికలో అవకతవకలు జరిగాయని, మూడుసార్లు మూల్యాంకన జరిగిందని కొందరు అభ్యర్థులు హైకోర్టు మెట్లు ఎక్కారు.. ఇంకోవైపు.. హైకోర్టు ఆదేశాలతో డిజిటల్ మూల్యాంకన రద్దు చేసి ఒకసారి మాత్రమే మాన్యువల్ గా మూల్యాంకన చేశామని వాదనలు వినిపించింది ఏపీపీఎస్సీ. ఇరువర్గాల వాదనలు విన్న సింగిల్ జడ్జి బెంచ్ మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చారు.. ఇక, సింగిల్ బెంచ్ తీర్పును ఏపీపీఎస్సీ డివిజన్ బెంచ్ ఎదుట సవాల్ చేసింది. తీర్పుపై స్టే విధించాలని కోరిన విషయం విదితమే.