జాబ్ సెర్చ్ లో ఉన్నవారికి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కోర్టుల్లో ఉద్యోగాల కోసం చూసే వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ఏపీ హైకోర్టు సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేసేందుకు ప్రక్రియను ప్రారంభించింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీచేయనున్నారు. వీటిల్లో 40 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా, 10 పోస్టులను బదిలీల ద్వారా భర్తీచేయనున్నారు. లా డిగ్రీ కలిగిన వారు ఈ పోస్టులకు ఇప్పుడే అప్లై చేసుకోండి.
Alsor Read:Bird Flu Outbreak: బర్డ్ఫ్లూ ఎఫెక్ట్.. గుంటూరులో చికెన్ అమ్మకాలు మాత్రం..
ఈ ఉద్యోగాలకు పోటీపడే వారు గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి లా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 01.02.2025 నాటికి 35 ఏళ్లు మించకూడదు. ఈ పోస్టులకు రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.77,840 నుంచి రూ.1,36,520 వరకు ఉంటుంది. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.750గా నిర్ణయించారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1500 చెల్లించాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 17వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.