సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో చుక్కెదురైంది.. రాంగోపాల్ వర్మ తనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చే శారు.. ఇక, ఆర్జీవీ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ వర్మ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది.. అరెస్ట్‌పై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని స్పష్టం చేసింది..
ముంబై నటి జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులకు మరోసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్ అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది.. అయితే, ఈ నెల 26వ తేదీ వరకు కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజు కీలక కేసులపై విచారణ జరగనుంది.. తనపై నమోదైన రెండు కేసులు క్వాష్ చేయాలని కాకాని వేసిన పిటిషన్ పై విచారణ జరపనున్న హైకోర్టు.. పిన్నెల్లి పిటిషన్లపై.. దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు తీర్పు వెలువరించనుంది..
ఎంపీ మిథున్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది.. పుంగనూరు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.. రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ హై కోర్టును ఆశ్రయించారు ఎంపీ మిథున్ రెడ్డి.. అయితే, ఈ రెండు కేసుల్లో ఎంపీ మిథున్ రెడ్డితో సహా ఐదుగురికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది ఏపీ హైకోర్టు.
మాజీ మంత్రి బాలినినేని శ్రీనివాస్‌రెడ్డి వేసిన పిల్‌పై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో.. బాలినేని పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
ఈవీఎంల వ్యవహారంపై ఆగస్టు 13వ తేదీన హైకోర్టులో పిల్ వేశారు బాలినేని.. అంతేకాదు.. ఆ పిల్‌పై ఆగస్టు 15వ తేదీన వాదనలు వినిపించారు బాలినేని తరుపున న్యాయవాది ఆలపాటి వివేకానంద.. ఇక, ఆగస్టు 17వ తేదీన తీర్పును రిజర్వు చేసింది హైకోర్టు.. ఈరోజు బాలినేని పిల్‌పై తుది తీర్పును వెలువరించనుంది హైకోర్టు..
స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. అసలు విషయం ఏమిటంటే ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో నంద్యాల పోలీసులు అల్లు అర్జున్‌పై ఒక కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును కొట్టేయాలని అల్లు అర్జున్, మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి కలిసి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం నాడు విచారణకు రాగా ఎఫ్ఐఆర్ ఆధారంగా నవంబరు 6…
నేడు ఏపీ హైకోర్టులో కీలక పిటిషన్లపై విచారణ జరగనుంది.. సినీ హీరో అల్లు అర్జున్ పిటిషన్ సహా.. ముంబై నటి జత్వాని కేసు సహా పలు పిటిషన్లు విచారణకు రానున్నాయి.. ఏపీ హైకోర్టులో హీరో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు.. ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును క్యాష్ చేయాలని పిటిషన్ వేశారు అల్లు అర్జున్.. ఇక, ఈ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది..
ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు ఐఏఎస్ అధికారులకు బెయిలబుల్ వారెంట్లును ఏపీ హైకోర్టు జారీ చేసింది.. హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోతే కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలన్న ఆదేశాలు పాటించకపోవడంతో బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు పేర్కొంది..
Nandigam Suresh: అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన మరియమ్మ హత్య కేసులో తనకు రెగ్యులర్ బెయిలు మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ మాజీ పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ బుధవారం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.