ఏపీలో పీఆర్సీ విషయంలో కొన్ని సంఘాలు సంతృప్తిగా వున్నా యూటీఎఫ్ లాంటి సంఘాలు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడలో యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్.ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎవరూ ఈ పీఆర్సీతో సంతృప్తి చెందలేదన్నారు. సమావేశ హాజరు పట్టీ సంతకాలను ఒప్పందంపై సంతకాలుగా చూపిస్తున్నారన్నారు.
ముగిసిపోయిన అధ్యాయం అని మంత్రులు అన్నారు సీఎం అభిప్రాయం మేం ప్రకటించాం.. సీఎం కు చెప్పేదేం లేదన్నారు.అహంకారం గా మాట్లాడే తీరు మార్చుకోవాలన్నారు. కొన్ని సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి. వారు మాకు మద్దతివ్వకపోవచ్చు. పెన్షనర్లు కూడా మాకు సపోర్టు చేస్తాం అన్నారు. ఉద్యమానికి వచ్చిన వారిని ఉపయోగించుకోవడం పీఆర్సీ నాయకత్వానికి తెలియలేదు.
హెచ్ఆర్ఏ తప్ప మరే అంశాలు పీఆర్సీ సాధన సమితి మంత్రులతో చర్చించలేదు. సీఎంఓ చుట్టూ తిరిగి కోర్కెలు తీర్చుకునే తత్వం మాది కాదు. జరగబోయే పరిణామాలు తుఫానులో టీకప్పా.. సునామీ యో తెలియాలంటే ఒక వారం ఆగండి. మీరు ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరిని మోసం చేసారన్నారు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు. మాకు మద్దతుగా 25 పైగా సంఘాలు ఉన్నాయి. 12వ తారీఖు తరువాత అందరూ మాతో వస్తారు. 6 లక్షల మంది మాతో కలిసి పోరాడతారు. గత జెఏసీ లాగా కాకుండా నికరంగా పనిచేసే జెఏసీ ని ఏర్పాటు చేస్తాం అన్నారు యూటీఎఫ్ నేతలు.