Minister Satya Prasad: పులివెందుల ప్రజలు రౌడీయిజం మాకు వద్దని కూటమి ప్రభుత్వం వైపు నడుస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ప్రశాంతమైన తిరుపతిలో రౌడీయిజం చేయడం కఠినమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించామన్నారు.
Drug Abuse: వాణి నగర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న చెట్లు పొదల మధ్య ఆరుగురు యువకులు మత్తు ఇంజక్షన్లు చేతికి ఎక్కించుకుంటున్న విజువల్స్ డ్రోన్ కెమెరా గుర్తించింది. వెంటనే స్పందించిన స్పెషల్ పార్టీ పోలీసులు అక్కడికి చేరుకుని ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు.
Anakapalli Tensions: అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్కు కోసం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం రసాభాసగా మారింది. భారీ బందోబస్తు, ముందస్తు అరెస్టులతో వాతావరణం వేడెక్కింది.
Andhra Pradesh Population Management Policy 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభాను పెంచే చర్యలు మొదలయ్యాయి. ప్రస్తుత రోజుల్లో సంతానోత్పత్తి తగ్గుదల, వృద్ధ జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని.. ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ముసాయిదాను ప్రభుత్వం రెడీ చేస్తోంది. నిపుణులు, మేధావుల సూచనలతో ముసాయిదాను రూపొందిస్తున్నారు. సంతానోత్పత్తి రేటును పెంచే చర్యల్లో భాగంగా పలు ప్రోత్సాహకాలను ముసాయిదాలో ప్రతిపాదించారు. ముసాయిదాలోని ప్రతిపాదనలు ఏంటో ఓసారి చూద్దాం. ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఉంటే ఆ కుటుంబంకు…
Investopia Global-AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టోపియా గ్లోబల్- ఏపీ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సు విజయవాడలో ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం నెలకొంది. కేసు ఛార్జిషీటులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేరును చేర్చడంతో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్ పై ఈ కేసులో పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్ను కొట్టి వేసింది.
Minister Narayana: రైతులకు కేంద్రం ఇచ్చే 6 వేలతో కలిపి మొత్తం 20 వేలు ఇస్తామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా తల్లికి వందనం పథకం ద్వారా 10 వేల కోట్లు విద్యార్ధుల తల్లుల ఖాతాలో జమ చేశామని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈరోజు (జూలై 15న) ఉదయం 9.45 గంటలకి గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 11.45 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు.
రాష్ట్రంలో రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గిట్టుబాటు ఇవ్వడం లేదని వైసీపీ మాజీమంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రైతుల వద్దకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్తే ఏడుస్తారు అని కూటమి ప్రభుత్వంను విమర్శించారు. ఏపీలో రైతుల పరిస్థితులు దయనీయంగా ఉండటం సమాజానికి విచారకరం అని పేర్కొన్నారు. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా కూటమి ప్రభుత్వ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి జగన్ గారిని తిట్టడానికి తప్ప ఎక్కడైనా తిరిగారా?…
CM Chandrababu: ఏపీ రాజధాని అమరావతిలో ప్రైవేట్, ప్రభుత్వ సంస్థల నిర్మాణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజధానిలో వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, హోటళ్లు, కార్యాలయాలు, వివిధ ప్రాజెక్టుల కోసం కేటాయించిన స్థలాల్లో ప్రస్తుత పరిస్థితిపై చర్చ. సమీక్షకు ఆయా సంస్థల అధినేతలు, ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.